హైదరాబాద్ నగరం విస్తరణలో ఓ ముఖ్యమైన ప్రాంతంగా కండ్లకోయ అభివృద్ది చెందుతోంది. ఓఆర్ఆర్ సమీపంలో ఉండటంతో పాటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లకు సులువుగా చేరుకునేలా రవాణా సౌకర్యం ఉండటంతో కాలనీలు విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి.
ఐటీ రంగంలోని ఉద్యోగులు సొంత నివాసాల కోసం ఐటీ కారిడార్ చుట్టుపక్కలే చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్లో అధికాదాయవర్గాలు మాత్రమే అటు వైపు కొనగులుగుతున్నారు. ఇతరులు కాస్త దూరం వెళ్లాల్సి వస్తోంది. వారికి కండ్ల కోయ మంచి ఆప్షన్ గా కనిపిస్తోంది. కోకాపేట వంటి ప్రాంతాలతో పోలిస్తే, కండ్లకోయలో భూమి , ఆస్తుల ధరలు బాగా తక్కువగా ఉంటున్నాయి. కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తూండటంతో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది.
బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇక్కడ వెంచర్లను అభివృద్ధి చేస్తున్నాయి, స్విమ్మింగ్ పూల్‌లు, క్లబ్‌హౌస్‌లు, గ్రీన్ స్పేస్‌లతో కూడిన ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఇళ్లు కూడా ఉన్నాయి. కండ్లకోయలో ప్రస్తుతం ఓపెన్ ప్లాట్లలో చదరపు గజం రూ. 20,000 నుండి రూ. 30,000 వరకు ఉంటున్నాయి. విల్లాలు , అపార్ట్మెంట్ల ధరలు సాధారణంగా రూ. 50 లక్షల నుండి రూ. 1.5 కోట్ల వరకు ఉంటాయి, ఇవి లగ్జరీ స్థాయిని బట్టి మారే అవకాశం ఉంది.
రీజనల్ రింగ్ రోడ్ , మెట్రో విస్తరణ ప్రాజెక్టులు ప్రాతిపాదనల్లో ఉండటంతో కండ్లకోయ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే అక్కడ కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్ పెరుగుతోదంి.