హైదరాబాద్ ఫారిశ్రామిక సిగలో ఆపిల్ కు విడిభాగాలు సరఫరా చేసే కంపెనీ ఫాక్స్ కాన్ యూనిట్ ఓ ఆభరణంగా మారనుంది. గత ఏడాది శంకుస్థాపన చేసిన ప్లాంట్ ను శరవేగంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే యూనిట్ స్ట్రక్చర్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. మరో ఒకటి, రెండు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలు ఉన్నయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫాక్స్ కాన్ లో నేరుగా పాతిక వేల ఉద్యోగాలు లభించనున్నాయి. పరోక్షంగా మరో లక్ష మందికి ఉపాధి లభించనుంది. రూ.3500 కోట్ల పెట్టుబడిని ఫాక్స్ కాన్ పెడుతోంది. మొత్తం రూ.4600కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. రెండోదశలో మిగిలిన పనులను పూర్తిచేయనున్నారు.
కొంగర కలాన్ వద్ద ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. కేన్స్ సెమికాన్ అనే మరో ఎలక్ట్రానిక్ సంస్థ కూడా ప్లాంట్ నిర్మిస్తోంది. ఫాక్స్‌కాన్‌లో సెల్ఫోన్లు తయారుచేయనుండగా…కేన్స్ సెమికాన్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లతో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉపయోగించే అతిముఖ్యమైన సెమీ కండక్టర్స్‌ను తయారుచేస్తారు. ఫాక్స్ కాన్ యూనిట్ ఇతర పరిశ్రమల వల్ల.. కొంగరకలాన్ చుట్టూ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది.
కోకాపేట తరహాలో .. కొంగలకలాన్ చుట్టుపక్కలగ్రామాల్లో భారీ ఎతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఔటర్ కు దగ్గరగా ఉండటంతో పాటు ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. ఈ కారణంగా కొంగరకలాన్ మరో కోకాపేటగా అభివృద్ధి చెందుతోంది.