ఒక బాధ్యతయుతమైన హోదాలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిసేబుల్డ్ వ్యక్తల గురించి ఘోరమైన ప్రకటన ఇవ్వడం స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం స్మిత సబర్వాల్ మామ్ అంటే నాకు ఎంతో గౌరవం . అభిమానం. ఒక స్త్రీగా ఐఏఎస్ ఆఫీసర్ హోదా సాధించడం ఒక విజయం అయితే తెలంగాణ మాజీ. రాష్ట్ర ముఖ్యమంత్రి కి ముఖ్య సలహాదారు గా ఉంటూ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించిన ఆమె, సందర్భం ఏదైనాప్పటికీ డిజేబుల్ కమ్యూనిటీ కి సంబంధించి నేరుగా వారి నీ ఉద్దేశించి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే తీవ్రంగా కలత కూడా చెందాను.
ఈ సందర్భ నేపథ్యం ఏంటంటే మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న 28 ఏళ్ల సైంటిస్ట్ కార్తీక్ అనే వ్యక్తి సివిల్ సర్వీసెస్ కి నాలుగు సార్లు అట్టెంప్స్ ఇచ్చినప్పటికీ కేవలం ఫిజికల్ కండిషన్ ద్వారా నిరాకరించబడటం జరిగింది. తాజాగా సివిల్ సర్వీసెస్ సెలక్షన్ లలో ఫేక్ డిసేబుల్ సర్టిఫికెట్లు పెట్టి ఐఏఎస్ సాధిస్తున్న వ్యక్తుల గురించి ఆయన స్పందిస్తూ అలాంటి వాళ్ళ వల్లే మాలాంటి వాళ్లకు అవకాశాలు దూరమవుతున్నాయి అని ఒక పత్రిక ముఖ్యంగా తన బాధను వ్యక్తపరిచారు. ఈ సందర్భాన్ని గురించి స్మిత సబర్వాల్ మేడం ట్వీట్ చేస్తూ.. ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఐఏఎస్ , ఐపిఎస్ లాంటి సర్వీసెస్ లో చాలా ముఖ్యం కాబట్టి అలాంటి వాటిలో డిజేబుల్ వాళ్ళకి కోటా ఎందుకు అని తన ఉద్దేశాన్ని వ్యక్త పరచాలి అనుకున్నారు అట.
అయితే ఫిజికల్ ఫిట్నెస్ అనే దానిమీద ఆమె ఎలాగైనా కూడా తన ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు .కానీ డిజేబుల్ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ ముఖ్యంగా డిజేబుల్ పైలెట్ నడిపే ఫ్లైట్ లో మీరు ప్రయాణిస్తారా ? డిజేబుల్ సర్జన్ తో మీరు సర్జరీ చేయించుకుంటారా ? అనే రెండు స్ట్రైట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వీటికి తోడు సివిల్ సర్వీసెస్ లాంటి అత్యున్నతమైన సర్వీస్ సెంటర్లో డిజేబుల్ వాళ్లకు కోట అవసరమా? అని ట్వీట్ చేయడం డిసేబుల్ కమ్యూనిటీ మనోభావాలను ఎంతగానో దెబ్బతీసేలా ఉంది. ఇప్పటికే కేవలం డిజేబులిటీ వల్ల ఎంతో డిస్క్రిమినేషన్ కి గురవుతున్న మేము ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల ఎంతో నెగిటివిటీనే ఎదుర్కోవాల్సి రావడమే కాకుండా అవకాశాల్ని కూడా చేజార్చుకోవాల్సి వస్తుంది. ఉన్నత చదువులు చదివి, ఉన్నత హోదాల్లో పనిచేస్తున్న ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంటే చదువు లేని, ఏమాత్రం లోకజ్ఞానం లేని పల్లెటూరులో ఉంటున్న వాళ్ళు మీడియాల ద్వారా ఇలాంటి విషయాలని విని ఒక ఐఏఎస్ అవ్వాలనుకున్న డిజేబుల్ వాళ్లని ఎంత అవహేళన చేస్తారనేది గ్రౌండ్ లెవెల్ లో వచ్చి వీరు చూడలేరు. కష్టపడి చదువుకున్న తెలివితేటలు ఉన్నప్పటికీ డిజేబులిటీ వల్ల అన్ ప్రొడక్టివ్ సెక్టార్లో పడిపోయిన కమ్యూనిటీ కేవలం పింఛన్ల కే పరిమితం అయిపోయింది.
Read Also : వికలాంగులకు సివిల్ సర్వీస్ ఎందుకు : స్మితా సభర్వాల్
ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ వారికి పెన్షన్లు పెంచడం తప్ప వారి ఆత్మ గౌరవంతో బతకడానికి కావలసిన అవకాశాలను ఉన్న అవరోధాలను తీసివేయడానికి ప్రయత్నించిన వారు లేరు. సొసైటీలో సింపతి తప్ప ఎంపతి లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్చుకుంటున్న మా కమ్యూనిటీ ఆత్మగౌరవంతో బతకడానికి డిజేబులిటీని అధిగమించి ఉన్నత చదువులు చదువుకోవాలని ఉన్నతంగా బతకాలని ప్రయత్నాలు చేస్తున్నాం. పైగా ఇప్పటికే ఉన్నత చదువులు కోసం పెద్ద పెద్ద యూనివర్సిటీలు డిజేబుల్ వాళ్లని కేవలం ఇలాంటి ఫిజికల్ కండిషన్స్ వల్లే ఎలిజిబుల్ కారు అని చెప్పేసి వాళ్ళని డిస్ క్వాలిఫై చేస్తూ వస్తూన్నారు. కోర్టులకేక్కి, మీడియా లో కెక్కి మా చట్టం మాకు ప్రసాదించిన హక్కులను కూడా ఎంతో గొడవపడి, వేదనకు గురి అయ్యి సాధించుకోవాల్సిన పరిస్థితులు ఉన్న సందర్భంలో ఇలాంటి స్టేట్మెంట్ వల్ల మేము ఇంకా వెనుకబడి పోతున్నాము కానీ, మాకు ఎటువంటి ప్రోత్సాహం అనేది ఉండడం లేదు. ఎన్నో విజయాలు సాధించినప్పటికీ మమ్మల్ని గుర్తించండి అని అడుక్కోవలసిన పరిస్థితులు ఉన్న సందర్భంలో.. ఇలాంటి స్టేట్మెంట్స్ చూసినప్పుడు డిజేబులిటీ నిజంగా మాకు ఉందా ? వారికి ఉందా అర్థం కాదు.
ఈ సందర్భంగా ఒక డిసేబుల్ గా, డిజేబుల్ ఆక్టివిస్ట్ గా నేను ఈ స్టేట్మెంట్ ని తీవ్రంగా ఖండిస్తూ.. స్మిత సబర్వాల్ గారు వెంటనే తన మాటలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం, లేనిచో మా ఆత్మగౌరవాన్ని కించపరిచి మమ్మల్ని పబ్లిక్ గా అవమానపరిచినందుకు మేము పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనకడుగు వేయమని సోషల్ మీడియా వేదిక తెలియజేస్తున్నాను. నా ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న మీడియ మిత్రులందరికీ మనవి చేస్తున్నాను .మీరు కూడా మీ వంతు బాధ్యతగా మీ వాయిస్ ని వినిపించి మా డిజేబుల్ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తారని మేము ఎవరికీ తక్కువ కాదు అని డిజేబిలిటీ అనేది మా శరీరానికి కానీ మాలోని ఆత్మస్థైర్యాన్ని కానీ, నైపుణ్యాలకు కానీ, మా టాలెంట్ కానీ కాదు అని ఎన్నో విజయ గాధలను చూపించి ఇలాంటి వారి కళ్ళను తెరిపిస్తారని కోరుకుంటున్నాను.
రచయిత
ఫౌండర్, డిఫరెంట్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్, డిసేబుల్ యాక్టివిస్ట్