ఆచార్య సినిమా అందరికీ షాక్ ఇచ్చింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆచార్య దారుణమైన పరాజయం చవిచూసింది. చిరంజీవి- రామ్ చరణ్ కలసి చేసిన ఈ సినిమా పై విడుదలకు ముందు చాలా బజ్ ఏర్పడింది. ట్రిపులార్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఐతే సినిమా మాత్రం బాక్సాఫీసు ముందు దారుణంగా దెబ్బ కొట్టేసింది. బయ్యర్లు, డిస్టిబ్యూటర్లకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ఐతే నష్ట నివారణ చర్యల్లో భాగంగా చిరంజీవి పది కోట్లు వెనక్కి ఇచ్చారని తెలిసింది. ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ వంతు వచ్చింది. కొరటాల పాతిక కోట్లు వెనక్కి ఇచ్చారని విశ్వసనీయవర్గాల ద్వార తెలిసింది. కొరటాల ఈ సినిమాకి అన్నీ తానై నడిపారు. సినిమా అమ్మకంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు నష్టం వాటిల్లింది. తన భాద్యత గా పాతిక కోట్లు వెనక్కి ఇచ్చారని తెలిసింది. ఒక దర్శకుడు పాతిక కోట్లు వెనక్కి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఒక సినిమాకి నష్టం వాటిల్లితే ఒక దర్శకుడు ఇంత మొత్తంలో వెనక్కి ఇవ్వడం బహుసా టాలీవుడ్ లో ఇదే మొదటిసారి కావచ్చు.