బాహుబలితో భారతదేశంలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుడు అనిపించుకున్నాడు రాజమౌళి. ఆయనకు అపజయమే లేదు. వరుసగా పదకొండు సూపర్ హిట్లు. అందులో బాహుబలి ఆల్ ఇండియా రికార్డు సృష్టించిన సినిమా. వరుసగా ఇన్ని హిట్లు అందుకున్న దర్శకుడు తెలుగు చిత్రసీమలోనే లేడు. అయితే.. మూడో సినిమాగా వచ్చిన `సై` మాత్రం కాస్ట్ ఫెయిల్యూర్ అని ఒప్పుకోక తప్పదు. ఆ సినిమాకి హిట్ టాక్ వచ్చింది గానీ, నిర్మాతకు డబ్బులు మిగల్లేదు. అంటే.. బాక్సాఫీసు లెక్కల ప్రకారం రాజమౌళికి మూడో సినిమాతో కాస్త బ్రేక్ వచ్చిందనుకోవాలి. ఆ లెక్కన కొరటాల శివ రాజమౌళి రికార్డుని బద్దలు కొట్టేసినట్టే. వరుసగా మూడు హిట్లతో తన ప్రయాణం మొదలెట్టాడు కొరటాల. ఇప్పుడు `భరత్ అనే నేను` కూడా హిట్ జాబితాలో చేరిపోయినట్టే. ఆ మాటకొస్తే.. తన మూడు చిత్రాలకంటే భరత్కే ఎక్కువ మైలేజీ వచ్చే అవకాశం ఉంది. అలా.. వరుసగా నాలుగు సూపర్హిట్లు కొరటాల ఖాతాలోకి వెళ్లాయి. రాజమౌళి కి `సై` బ్రేక్ ఇచ్చింది గానీ.. లేదంటే కొరటాలే కాదు, ఎవరూ కొట్టలేని రికార్డు రాజమౌళి ఖాతాలో ఉండేది.