ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ప్రస్తుతానికైతే డివైడ్ టాక్‌తోనే సినిమా నడుస్తోంది. అయితే చిత్రబృందం మాత్రం ‘మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘అంటోంది. శుక్రవారం హైదరాబాద్‌లో కొరటాల శివ విలేకరులతో మాట్లాడారు. సినిమాకి వస్తున్న స్పందన బాగుందని, చిత్రసీమలోని ప్రముఖులంతా ఫోన్లు చేసి అభినందిస్తుంటే ఆనందంగా ఉందని, ఇది శ్రీమంతుడు కంటే పెద్ద విజయం అంటూ.. మాట్లాడారాయన. ఈ సినిమాలోని లోటు పాట్ల గురించి అడిగినప్పుడు ”ఎన్టీఆర్ సినిమా ఇలా ఉండాలి అనే కొలతలతో రాసుకొన్న కథ కాదు. తెరపై ఏం జరిగినా అది.. కథ ప్రకారమే నడిచింది. ఓ కమర్షియల్ సినిమాలో సోషల్ మెసేజ్ ఇవ్వడం మామూలు విషయం కాదు. అది జనతా తో సాధ్యమైంద”నిచెప్పుకొచ్చాడు కొరటాల
సినిమా మరీ స్లోగా ఉందన్న వాదనా కొట్టి పారేశాడు. సినిమాలో ప్రతీదీ అవసరం మేరకే అనిపించిందని, కథ నుంచి బయటకు వచ్చి ఏం చేయలేదన్నాడు. కథ చెప్పాల్సివచ్చినప్పుడు అలానే అనిపిస్తుంది. హీరోయిన్ల పాత్రల గురించి విమర్శలు వచ్చాయి కదా? అని అడిగితే.. ”సమంత పాత్ర చాలా ఉదాత్తమైనది. బావ కోసం ఏమైనా చేస్తుంది. అందుకోసం ఆ పాత్రని అలా తీర్చిదిద్దాం. కేవలం ఫ్యాన్స్‌కే కాదు, సామాన్య ప్రేక్షకులకూ ఈసినిమా నచ్చింది. అందుకే ఇన్ని కలక్షన్లు వస్తున్నాయి” అంటున్నాడీ దర్శకుడు,