”ఆచార్య’ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. నిజానికి కొరటాల రామ్ చరణ్ తో సినిమా చేయాల్సింది. కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ – కొరటాల కలయికలో సినిమా ప్రకటన వచ్చింది. కానీ ఏవో కారణాలతో సినిమా క్యాన్సిల్ అయ్యింది. అలాగే కొరటాల ఖాతాలో మరో మెగా సినిమా కూడా చేరినట్లే చేరి క్యాన్సిల్ అయ్యింది. అల్లు అర్జున్ – కొరటాల కలయికలో సినిమా ఖరారైయింది. ఏం జరిగిందో తెలీదు..ఆ సినిమా కూడా తప్పింది.
అయితే ఈ రెండు కథలు కూడా కొరటాల లైన్ లో ఉంచారు. రెండూ మంచి కథలే. ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా పూర్తిగా కొత్త కథ. ఈ రెండు కథలతో సంబంధం లేదు. ఇప్పుడు కొరటాల దగ్గర రెండు బౌండ్ స్క్రిప్ట్ లు వున్నాయి. మరి ఇద్దరు మెగా హీరోలు వదులుకున్న ఈ కథల్లో ఏ స్టార్ హీరోలు వస్తారో చూడాలి. ప్రస్తుతం కొరటాల ద్రుష్టి ఆచార్య పై వుంది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ సినిమాకి షిఫ్ట్ అవుతారు కొరటాల. అయితే ఈ గ్యాప్ లో ఆరెండు కథలకు తగ్గ హీరోలు దొరికితే వారితోనే సినిమా ప్రకటన వచ్చే అవకాశం కూడా వుంది.