అత్యుత్సాహమో లేక ఆరాటమో గాని అనుభవజ్ఞుడైన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సందర్భాల్లో మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆయన దక్షిణ కొరియాలో పర్యటన చేస్తున్నారు. షరా మామూలుగా వారిని పెట్టుబడులు పెట్టమని పిలిచారు బాగానే వుంది. కొరియాలోని కియా సంస్థ కూడా తమ గ్రూపు తరపున తలపెట్టిన పెట్టుబడులు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇవ్వడం కూడా ఒకే. ఇలా గ్రూపు సంస్థలన్నీ కలసి చేయడంపట్ల కూడా చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారట. తర్వాతనే కొంచెం విజృంభించారు. ఆంధ్ర ప్రదేశ్‌ను మీ కొరియా రెండవ రాజధానిగా భావించమని సెంటిమెంటు మొదలుపెట్టారు. పైగా అనంతపురంలో కియా సంస్థ కోసం కొరియా టౌన్ నిర్మిస్తామని మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. నిజంగా దేశంలోనైనా విదేశాల వారైనా లాభ నష్టాలను బట్టి పెట్టుబడులు పెడతారు గాని ఇలాటి సెంటిమెంట్లకు లోబడతారా? పెట్టుబడులతోనే దేశాలు అక్కడివి ఇక్కడ ఇక్కడవి అక్కడా మారిపోతాయా? పైగా ప్రపంచంలో రెండంకెల అభివృద్ధి శాతం సాధించగల సత్తా ఇండియూకే వుందని మరో మాట వేశారు. వాస్తవానికి నోట్ల రద్దు జిఎస్టి తర్వాత ఏడు శాతంకన్నా దిగువకు పడిపోయిన జిడిపి పెరుగుదల శాతం గురించి ప్రపంచమంతా చర్చ జరుగుతున్నది. ఇలాటి నేపథ్యంలో ఇంత టూమచ్ టాక్ అవసరమా అద్యక్షా?