నెల్లూరు రూరల్ లోకి అడుగు పెట్టిన నారా లోకేష్ పాదయాత్రకు కోటంరెడ్డి బ్రదర్స్ చేసిన ఏర్పాట్లు ఔరా అనిపించాయి. ఆయన జన సమీకరణకు తన బలం మొత్తం ఉపయోగించారు., పాదయాత్ర ఓ రేంజ్ లో జరగడంతో టీడీపీ నేతలు ఖుషీ అయిపోయారు. కానీ వైసీపీ నేతలకు పుండు మీద కారం పోసినట్లయింది.
నిజానికి కోటంరెడ్డి … జగన్ రెడ్డి చేసిన పాదయాత్రకు నెల్లూరులో అంతా తానై వ్యవహరించారు. టీడీపీ అధికారంలో ఉంది.. వైసీపీ తరపున కీలక నేతలెవరూ జగన్ పాదయాత్ర బాధ్యతలను పూర్తి స్థాయిలో తీసుకోవడానికి సిద్ధపడలేదు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. జగన్ రెడ్డి పాదయాత్రను సక్సెస్ చేసేలా తమ పాత్ర పోషించారు. అయితే జగన్ రెడ్డి ఈయనకు ఇచ్చిన ప్రాధాన్యం లేదు. ఆ కోపం ఏమో కానీ ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు అంతకు మించిన ఏర్పాట్లు చేశారు. భారీగా జన సమీకరణ చేశారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం.. కోటంరెడ్డి లాంటి విధేయుడ్ని దూరం చేసుకున్నందుకు వైసీపీ హైకమాండ్ ఇప్పటికే బాధపడుతూ ఉంటుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. కోటంరెడ్డి .. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీని వదిలి పెట్టలేదు. జగన్ కోసం ఎఏంత దూరమైనా అన్నట్లుగా ఉండేవారు. కానీ ఇప్పుడు టీడీపీ కోసం ఆయన ఆ విధేయత ప్రదర్శిస్తున్నారు.