వైసీపీని ధిక్కరించి ఏపీలో ఉంటున్నారంటే వారికి మూడినట్లే. అందుకే రఘురామకృష్ణరాజు ఏపీకి రావాలని భయపడుతున్నారు. చట్టాలు..రాజ్యాంగాలు ఏవీ కాపాడలేవని ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆయన పై కేసులు పెట్టి అరెస్టు చేయిస్తామని మొదట్లో లీకులు ఇస్తే.. సరే రండి అని ఆయన సవాల్ చేశారు. భయపడటం లేదేమోనని ఆయన అనుచరులపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నరు. ఈ అంశంపై శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి సజ్జలపై మండిపడ్డారు.
రాష్ట్రం మొత్తం ఎన్నో సమస్యలు ఉంటే అవన్నీ కాదని.. నెల్లూరు రూరల్‌పై దృష్టి పెట్టారని.. తనపై కక్షకట్టారని..తనపై అక్రమ కేసులు పెట్టటంతో పాటు తన అనుచరులపై కూడా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఎన్ని కేసులు పెట్టినా తాను గానీ..తన అనుచరులు గానీ ఏమాత్రం భయపడేది లేదని స్పష్టంచేశారు కోటంరెడ్డి. సీఎం జగనే అయినా షాడో ముఖ్యమంత్రి మాత్రం సజ్జలేనని స్పష్టం చేశారు. ఆయనే ఆదేశాలతోనే తనపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని..తనను భయపెట్టటానికి చూస్తున్నారని ఇటువంటి చిల్లర రాజకీయాలన్నీ నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడే చూశానని భయం అనేది నా బ్లడ్ లోనే లేదంటూ మండిపడ్డారు కోటంరెడ్డి.
నన్ను కేసులతో బెదిరించాలని నాలుగు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టారు అంటూ మండిపడ్డారు. ముఖ్య అనుచరుడు తాటి వెంకటేశ్వర రావును అరెస్ట్ చేశారని..అతనితో పాటు జావేద్ లను అరెస్ట్ చేశారని కానీ వీరి అరెస్ట్ లపై పోలీసులు ఎటువంటిసమాచారం ఇవ్వలేదని అన్నారు
తానిప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మరాను కాబట్టి నాలుగు నెలల క్రితం కేసు కానిది ఇప్పుడు కేసు అయ్యిందని ఇవి ప్రభుత్వం చేసే వ్యవహరాలు అంటూ మండిపడ్డారు. ఎలాంటి పరిణామాలను అయినా ఎదుర్కొనేందుకు రెడీ అని అయన సవాల్ చేస్తున్నారు.