ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్తపలుకులో.. లాజిక్ అందని ఓ విషయం బయట పెట్టారు. అదేమిటంటే.. జగన్మోహన్ రెడ్డినే… బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరేందుకు తహతహలాడుతున్నారని.. ఆయనే స్వయంగా… తమ పార్టీని కేంద్ర కేబినెట్లో చేర్చుకోవాలని ప్రతిపాదన పెట్టారని అంటున్నారు. అయితే… జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదన పెట్టడం దాదాపుగా అసాధ్యమని అనుకోవచ్చు. ఎందుకంటే… బీజేపీ ఓటు బ్యాంక్ పూర్తిగా.. యాంటీ బీజేపీ. ఓ వేళ వైసీపీ బీజేపీతో కలిస్తే వారంతా.. వ్యతిరేకమవ్వడం ఖాయం అప్పుడు వైసీపీ పునాదులే కదిలిపోతాయి. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియనిది కాదు. ఆర్కేకి కూడా తెలుసు. ఆ విషయం తన కొత్త పలుకులో చెప్పారు. కానీ.. కేసుల పేరుతో జైలుకెళ్తే డ్యామేజ్ కన్నా… బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల డ్యామేజ్ పెద్దది కాదని జగన్ భావిస్తున్నారని ఆర్కే విశ్లేషించారు.
కేసుల వల్ల జైలుకెళ్తే రాజకీయ జీవితం అంతమవుతుంది.. పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరం అవుతుంది.. అలా కాకుండా.., పార్టీకి మద్దతిచ్చేవాళ్లని కొంత మందిని బలి పెడితే.. తన సమస్యకు పరిష్కారం అయిపోతుంది.. కేసులు మాఫీ అవుతాయని.. జగన్ భావిస్తున్నట్లుగా ఆర్కే చెబుతున్నారు. నిజానికి ఇది లాజిక్ లేని విషయమే. ఎందుకంటే..జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో చేరకపోయినప్పటికీ హ్యాపీగానే ఉన్నారు. ఆయన ఎనిమిది నెలలుగా కోర్టుకు ఒక్క సారి మాత్రమే వెళ్లారు. మామూలుగా ఇలాంటి కేసుల్లో అన్ని నెలల పాటు కోర్టుకు డుమ్మా కొడితే.. కండిషన్స్ బెయిల్ మీద ఉన్న వ్యక్తికి ఈ పాటికి బెయిల్ క్యాన్సిల్ అయి ఉండేది. ఇక.. జగన్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు కేంద్రం మౌనంగానే మద్దతిస్తోంది. కేంద్రం నుంచి జగన్ కు ఇప్పటికిప్పుడు..ఎలాంటి ఇబ్బందులు లేవు. ఉన్న పళంగా ఎన్డీఏలో చేరి.. తనకు మద్దతిచ్చే వర్గాలను దూరం చేసుకోవాలని జగన్ అనుకోవడంలో లాజిక్ లేదు.
అదే సమయంలో.. అవినీతి అంశంపైనా… ఆర్కే.. కాస్త వితండవాదం చేశారు. జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల అవినీతి చేశారని.. ప్రజలు నమ్మలేదని అందుకే ఓట్లేశారని… చంద్రబాబుపై అవినీతి మరకలు వేసినా… జనం నమ్మరని.. ఓట్లు వేయడానికి ఇప్పుడు అవినీతి ప్రాతిపదిక కాదని అంటున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాను ఇరికించడానికే ఐటీ దాడులు చేయించారన్న ప్రచారం కూడా… కరెక్ట్ కాదని.. తనకు తెలిసిన ఐటీ అధికారులతో మాట్లాడి మరీ చెప్పినట్లుగా ఆర్కే చెబుతున్నారు. లాజిక్లకు అందని రాజకీయం నడస్తున్న తరణంలో… ఈ వారం కొత్తపలుకులో కూడా.. లాజిక్ మిస్సయింది. కాస్త వితండవాదంగా అనిపిస్తోంది.