విశాఖ పట్నం అందమైన సిటీ. అక్కడ ఉండాలనుకునేవారు ఎక్కువే. అయితే అక్కడ జీవనం కాస్త కాస్ట్లీనే. సొంత ఇల్లు అయితే ఇంకా కష్టం. జీవితంలో జీతం ద్వారా సంపాదించి.. ఎంతో కొంత వెచ్చింది ఇల్లు కొనుక్కోవడం చాలా మంది లక్ష్యం. కానీ కొంత మందికి కలగానే ఉంటుంది. భవిష్యత్ పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నవారికి యిప్పుడు కాస్త ముందు చూపుతో ఆలోచిస్తే వైజాగ్ లో ఇల్లు సొంతమవుతుంది. కొత్త వలసలో ఇల్లు లేదా ఫ్లాట్ కొనుక్కుంటే.,. విశాఖలో ఆస్తి పరులైపోయినట్లే.
విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తుంది కొత్తవలస. కానీ విశాఖకు చాలా దగ్గర. విశాఖపట్నం నుంచి 27 కి.మీ. దూరంలో ఉన్న కొత్తవలస గ్రామం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇళ్లు పెరుగుతున్నాయి. కాలనీలూ వెలుస్తుననాయి. వైజాగ్లో అత్యంత ఖరీదుగా ఉండే నివాసాలు కొత్త వలసకు వచ్చే సరికి అందుబాటులో ఉంటున్నాయి. వైజాగ్ కి 30 కి.మీ. లోపు దూరంలోపు ఉండటంతో పాటు మధ్యతరగతి ప్రజలకు నివాసాలుగా మారిపోయింది. కొన్ని వేల మంది డైలీ కొత్తవలస టు వైజాగ్ అప్ అండ్ డౌన్ చేస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లి వస్తూంటారు.
షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కింద కాకుండా.. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుబడి పెట్టినట్లయితే అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ లో ఉన్న భూముల ధరలను ఈ ఏరియాలో చూడవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొత్త వలసలో ఇళ్లు నిర్మిస్తున్న కాలనీల్లో ఇరవై లక్షలు పెడితే రెండు వందల గజాల వరకు స్థలం వస్తుంది. ఓ పదేళ్ల తర్వాత గ్రేటర్ విశాఖలో ఇదొక భాగం అయిపోయినా ఆశ్చర్యం లేదు. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్లో కొత్త వలస చాలా బెటరన్నది ఎక్కువ మంది అభిప్రాయం.