జగన్ పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. కొన్ని ఏరియాల్లో జనం కాస్త పల్చగా వస్తూంటే కొన్ని ఏరియాల్లో విపరీతంగా వస్తున్నారు. మరి స్థానిక నాయకుల ప్రయత్నాలు కొన్ని చోట్ల బాగుండి కొన్ని చోట్ల బాగోకపోవడం దీనికి కారణమేమో తెలీదు. అయితే ఈ యాత్ర సందర్భంగా జరుగుతుంది అనుకున్న ఒక విషయం ఇప్పుడు అస్సలు ప్రస్తావనకే రావడం లేదు. అదే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వైసిపిలో చేరతాడనే విషయం.
కోట్ల మాజీ కేంద్ర మత్రి కూడా. పైగా జిల్లాలో పట్టున్న నాయకుడు. ఆయన కోసం వైసిపి ఎప్పటి నుంచో గట్టిగా ప్రయత్నిస్తోంది. పైగా వైసిపి ఎంపీ బుట్టా టిడిపి లో చేరాక వైసిపి మరింతగా ప్రయత్నిస్తోంది. ఆమధ్య నేను ఎప్పటికీ కాంగ్రెస్ లో నే ఉంటా అని ఆయన ప్రకటించినా రాజకీయాల్లో ఇవన్నీ పట్టించుకోదగ్గ ప్రకటనలు కావు అనే ఉద్దేశ్యం తో వైసిపి ఆయనకి గాలం వేస్తూనే ఉంది. అప్పట్లో వైసిపి వర్గాల్లో జరిగిన ప్రచారం ప్రకారం, పాదయాత్ర సందర్భంగా కర్నూల్ కి జగన్ వచ్చాక కోట్ల ఇలాఖా చేరుకున్నాక ఆయన జగన్ తో కలుస్తారు ఆ తర్వాత పార్టీలో చేరుతారు. ఇదీ ఆ ప్రచారం.
కానీ ఇప్పుడు కోట్ల వైసిపి కి పూర్తిగా హ్యాండిచ్చినట్టే కనిపిస్తోంది. ఆయన చేరట్లేదని వైసిపి కి స్పష్టమైపోయింది. దాంతో జగన్ పాదయాత్ర రూట్ ని కూడా జగన్ కాస్త మార్చుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు, ఇప్పుడు ఎంపీ టికెట్ బీసీ లకి ఇస్తానని జగన్ ప్రకటించడం చూస్తుంటే జగన్ కూడా కోట్ల పై పూర్తిగా ఆశలు వదిలేసుకున్నట్టు అర్థమవుతోంది.