దారుణాలకు పాల్పడి.. బాధితులపైనే నిందను వేయడంలో వైసీపీ నేతలు ఏ మాత్రం మంచి, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఇప్పటి వరకూ రాజకీయాల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు ఇతర మరణాలకూ అన్వయిస్తున్నారు. తిరుమలలో ఓ చిన్నారిని చిరుత లాక్కెళ్లి చంపేసింది. ఈ వ్యవహారంలో టీటీడీ నిర్లక్ష్యం స్పష్టమయింది. గత నెలలోనే ఓ చిన్నారిని ఇలా పులి లాక్కెళితే అతి కష్టం మీద కాపాడారు. కానీ ఈ సారి అలాంటి చాన్స్ దొరకలే్దు. నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిని పులి చంపేసింది.
లక్షిత తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి చెందిన వారు. శ్రీవారి దర్శనానికి వెళ్లి పాపను పులికి బలిచ్చుకోవాల్సి వచ్చింది. దీనిపై కోవూరు ఎమ్మెల్యే స్పందన చూస్తే.. ఎవరికైనా .. ఈయన మనిషేనా అని అనుకోకుండా ఉండలేరు. ” ఈ ఘటనలో లక్షిత తల్లిదండ్రులపై అనుమానంగా ఉందని.. పోలీసులు వారిని లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. ఇది ఆడపిల్లకు సంబంధించిన అంశమని అందుకే విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతిపై టీటీడీ ఛైర్మన్‌తో మాట్లాడినట్టు ప్రసన్న తెలిపారు. చాలా విచారం వ్యక్తం చేశారని.. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నట్టు కూడా చెప్పారని తెలిపారు. పేరెంట్స్‌ను కూడా విచారించాలని తాను చెప్పినట్టు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ప్రసన్న మాటలు విన్న తర్వాత ఇంత ఘోరంగా ఎలా ఆలోచిస్తారో … బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల మానసిన స్థితి గురించి కనీసం ఆలోచన కూడా చేయరా అన్న అసహ్యం వ్యక్తమవుతోంది. ఫోరెన్సిక్ రిపోర్టులోనూ పులి లాక్కుపోయి చంపిందని తేలింది. ప్రతి మీటర్‌కు ఒక సెక్యూరిటీ గార్డును పెడతామని టీటీడీ ఈవో చెబుతున్నారు. కానీ ఇటీవల ఓ పాపను లాక్కుపోయిన తర్వాతే జాగ్రత్త పడి ఉంటే.. ఈ పాప ప్రాణం పోయేది కాదు కదా అన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకటనలు… మరింత అసహ్యం కలిగేలా ఉన్నాయి.