ప్రసిద్ధ మళయాలహీరో మోహన్‌లాల్‌తో మరోసారి మహాభారతం వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తారనే వార్తలు దేశమంతటా ఆసక్తి రేకెత్తించాయి. ఈ చిత్రంలో నాగార్జున కర్ణుడిగా నటించే అవకాశముందని ఆయనే చెప్పారు. అసలు బాహుబలి విశ్వ సంచలనం తర్వాత ఇదే రాజమౌళి ప్రాజెక్టు అని కూడా కథనాలు వస్తే ఆయనే ఖండించారు.ఇంతకూ ఇంతకూ ఈ మహాభారతం సినిమాకు మూలం ప్రముఖ మళయాల రచయిత ఎం.టి.వాసుదేవ నాయర్ రచించిన రాందమూలం నవల. అంటే మరోసారి అని అర్థం. 1985లో సాహిత్య అవార్డు పొందిన ఈ నవలను 1997లో మరోసారి అన్న పేరిటనే ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించారు.ఈ నవలలో ఆయన హేతువాద దృష్టిని ప్రదర్శించి మహిమలు దాదాపు లేకుండా చేశారు. ద్రౌపదీ వస్త్రాపహరణం కూడా ఆ రూపంలో వుండదు. ఇప్పుడు ఆ నవలనే తెరకెక్కించాలనే ప్రయత్నాలు తారల ఎంపిక జరుగుతున్నది.ఇలాటి విషయాలను వివాదం చేయడంలో పేరు మోసిన సంఘ పరివార్ శక్తులు వెంటనే రంగంలోకి దిగిపోయాయి. హిందూ ఐక్యవేది అనే మళయాల సంస్థ నాయకురాలు కె.పి.శశికళ ఈ చిత్రం భారత గాథను దారి తప్పిస్తుందంటూ ముందే దాడి ప్రారంభించారు. వేద వ్యాసుడు రాసిన భారతం తప్ప మరేదీ ఆ పేరు పెట్టుకోవడానికి వీల్లేదని ఈ సంస్థ వాదిస్తున్నది. గతంలో పలుచిత్రాలకు అడ్డుపడి విధ్వంసాలు వివాదాలకు కారణమైన శక్తులు మహాభారతం కు కూడా అడ్డుపడతారనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. పైగా ఇలా కథలకు సినిమాలకు అడ్డు పడటం ప్రజాస్వామికం కాదు కూడా. ఎన్టీఆర్ తీసిన దానవీరశూరకర్ణలో కులవ్యవస్థపైన రాజరిక మోసాలపైన అనేక వ్యాఖ్యలుంటాయి, దాన్ని ప్రజలెంతగా ఆదరించారో అందరికీ తెలుసు.కనుక ఏ కథ ఎలా తీయాలో ఏ పేరు పెట్టాలో శాసించే హక్కు ఎవరికీ వుండదు. తర్వాత సెన్సార్ బోర్డు వుంటుంది. అంతేగాని అసలు షూటింగుకు ముందే గొడవ చేయడం దారుణం