‘ఓనమాలు’ సినిమాతో దర్శక నిర్మాతగా మారి సినిమా మీద ఉన్న ఇష్టాన్ని చూపించిన క్రాంతి మాధవ్ రెండో సినిమాగా చేసిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాతో హిట్ అందుకున్నాడు. అయితే సినిమా సినిమాకు కాస్త గ్యాప్ ఎక్కువగా తీసుకుని బాగా వర్క్ అవుట్ చేసే క్రాంతి మాధవ్ ఈసారి సునీల్ తో సినిమా చేస్తున్నాడు. సినిమా టైటిల్ కూడా ‘సంతోషం సగం బలం’ అని పెట్టినట్టు సమాచారం. హీరోగా టర్న్ అయిన సునీల్ మొదట్లో కాస్త పర్వాలేదనిపించుకున్నా ఈమధ్య హిట్ కోసం మొహమాసి పోయి ఉన్నాడు.
అందుకే కథల విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడుతున్నాడు. రీసెంట్ గా కృష్ణాష్టమి అని వచ్చినా లాభం లేకుండా పోయింది. అందుకే ఈసారి పక్కా హిట్ అనుకున్న కథతోనే ముందుకెళ్లాలను ఆలోచిస్తున్నాడు. ఆ క్రమంలోనే వీరు పోట్ల దర్శకత్వంలో ‘ఈడు గోల్డ్ ఎహె’ సినిమా చేస్తున్న సునీల్, క్రాంతి మాధవ్ తో కూడా కమిట్ అయ్యాడు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా అయినా సునీల్ కోరుకుంటున్న హిట్ ఇస్తుందో లేదో చూడాలి.