నిస్సందేహంగా క్రిష్ గొప్ప దర్శకుడు. తెలుగు సినిమాను కొత్త పంథాలో తీసుకువెళ్తున్న దర్శకుల్లో ఒకడు. గమ్యం, వేదం, కంచె, శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు… తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు తీస్తున్న దర్శకుడు. క్రిష్ సినిమా జీవితం గొప్పగా సాగుతుంది. కానీ, వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలున్నాయి. ఆయన సంసార జీవితంపై పలు వార్తలు వచ్చాయి. విడాకుల వరకూ వెళ్లిందని వినికిడి. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడు విడుదలైన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించడానికి క్రిష్ నిరాకరించారు. పెళ్లి పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ఇబ్బందులు, మానసిక ఒత్తిడి గురించి క్రిష్ స్పందిస్తూ ‘‘ఎలాంటి బాధనైనా మరిపించేది పని మాత్రమే అని ఎన్టీఆర్ కథానాయకుడులో ఒక డైలాగ్ ఉంది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత విషయాలు వుంటాయి. అది (పెళ్లి) నా వ్యక్తిగతం’’ అన్నారు.