తన సినిమాల్లో సృజనాత్మకతని మిలితం చేస్తూ సినిమా సినిమాకు ఎంతో గొప్ప ఖ్యాతిని సంపాధించుకున్న దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్). వరుణ్ తేజ్ కంచె సినిమాతో కొద్ద్రిరోజుల క్రితమే హిట్ కొట్టిన ఈ దర్శకుడు ప్రస్తుతం తర్వాత సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. తెలుస్తున్న కథనాల ప్రకారం క్రిష్ తన ఫస్ట్ ఫ్రేం పతకంలో రాయబారి అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. కంచె హిట్ అయినా క్రిష్ ఇంతవరకు తన తర్వాత సినిమా ఏం చేస్తున్నాడు..ఎవరితో చేస్తున్నాడు.. అన్నది తెలియలేదు.
కాని ఫిల్మ్ చాంబర్లో క్రిష్ రాయబారి టైటిల్ ని రిజిస్టర్ చేయించడంతో ఎవరి కోసం ఆ టైటిల్ ని రిజర్వ్ చేశాడా అని ఆలోచిస్తున్నారు సిని ప్రియులు. సినిమా సినిమాకు సంబధం లేకుండా సృజనతో సినిమాలు తీస్తున్న క్రిష్ అంటే కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల దాకా గురి ఉంది. ప్రతి ఒక్క హీరో క్రిష్ తో సినిమా చేసేందుకు సిద్ధంనే ఉన్నారు. అయితే క్రిష్ మాత్రం అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కోసమే రాయబారి టైటిల్ రిజిస్టర్ చేయించాడని తెలుస్తుంది.
తెలుగుదనం ఉట్టిపడే టైటిల్స్ పెడుతూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న దర్శకుడు క్రిష్ అఖిల్ తో సినిమా అంటే ఖచ్చితంగా అది చాలా గొప్ప సినిమా అయ్యే అవకాశం ఉంది. అఖిల్ హీరోగా తెరంగేట్రం చేసిన ‘అఖిల్’ సినిమా ఆశించినంత విజయాన్ని నమోదు చేసుకోలేదు కాబట్టి కింగ్ నాగార్జున అఖిల్ రెండో సినిమా భాధ్యతను క్రిష్ చేతిలో పెట్టాడట. క్రిష్ ‘రాయబారి’ టైటిల్ ఎందుకు రిజిస్టర్ చేయించాడు.. ఏ హీరోతో ఆ సినిమా చేస్తాడు అన్నది కొద్దిరోజుల్లో తెలుస్తుంది.