క్రిష్‌.. అనుష్క‌.. ఓ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌!

‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అర్థాంత‌రంగా ఆగిపోవ‌డంతో క్రిష్ ఖాళీ అయిపోయాడు. ఈ యేడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగి, రాజ‌కీయాలు చ‌ల్ల‌బ‌డినంత వ‌ర‌కూ ప‌వ‌న్ ఏ సినిమాకీ అందుబాటులో ఉండ‌డు. అప్ప‌టి వ‌ర‌కూ క్రిష్ ఏం చేయాలి? అందుకే మ‌రో క‌థ రెడీ చేసుకొంటున్నాడు. ప‌వ‌న్ వ‌చ్చేలోగా పూర్త‌య్యిపోయేలా ఓ సినిమా చేయాల‌న్న‌ది క్రిష్ ప్లాన్‌. యువ హీరోలంతా బిజీగా ఉన్నారు. స్టార్లు అందుబాటులో లేరు. అందుకే ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ సిద్ధం చేశాడు. ఈ క‌థ‌కి అనుష్క అయితే న్యాయం చేస్తుంద‌న్న‌ది క్రిష్ న‌మ్మ‌కం. అనుష్క‌తో క్రిష్‌కి మంచి రాపో ఉంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ‘వేదం’ అనుష్క‌కు మంచి పేరు తీసుకొచ్చింది.

అయితే అనుష్క ఇప్పుడు సినిమాల విష‌యంలో చాలా మొండిగా ఉంది. ఓ ప‌ట్టాన క‌థ‌లు ఒప్పుకోవ‌డం లేదు. పైగా సినిమాల‌పై ఆమెకు ఆస‌క్తి క్ర‌మంగా త‌గ్గిపోతోంది కూడా. ఈ నేప‌థ్యంలో క్రిష్ సినిమాలో న‌టించ‌డానికి మొగ్గు చూపిస్తుందా? అనేది అనుమాన‌మే. అందుకే క్రిష్ రెండు, మూడు ఆప్ష‌న్ల‌ను రెడీ చేసుకొన్నాడు. త‌న మొద‌టి ఎంపిక మాత్రం స్వీటీనే. ప్ర‌స్తుతం స్క్రిప్టు రెడీ చేసే ప‌నిలో ఉన్నాడు క్రిష్. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌ టైంపాస్ విమర్శలు !

జగన్మోహన్ రెడ్డికి పాస్ పోర్టు రాలేదు. లండన్ పోలేకపోయారు. అలాగని విజయవాడలో ఉండలేకపోయారు. బెంగళూరు వెళ్లిపోయారు. రాత్రికి రాత్రి ఓ ట్వీట్ పడేశారు. అది చాట భారతం అంత ఉంది...

క్లౌడ్ బరస్ట్ : ప్రపంచానికి కొత్త ముప్పు !

ఇంతటి వర్షాలు ఎప్పుడూ చూడలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఆశ్చర్యపోయారు. గుజరాత్‌ సీఎంగా చాలా కాలం ఉన్నా.. ఎన్నో విపత్తులను చూశా కానీ ఇప్పుడు పడిన వాన, వరద విలయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు....

మున్నేరు డేంజర్ బెల్స్..ఖమ్మం జిల్లాకు మరోసారి ముప్పు!

ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి...

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close