డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు తెరపైకి రావడం చాలా మందికి షాక్ కలిగించింది. ముఖ్యంగా క్రిష్ గురించి అంతో ఇంతో తెలిసివారైతే ఇంకా ఆశ్చర్యపోయారు. ఎక్కడ కలిసినా సినిమాలు, సాహిత్యం, కళలు గురించి తప్పితే మరో టాపిక్ జోలికి పోనీ క్రిష్..ఇలాంటి ఒక కేసులో వార్తల్లో నిలవడం ఆయన్ని ఎరిగిన వారికి ఒక్కింత ఒలికిపాటుకు గురి చేసింది. ఇప్పుడు ఆయన హైకోర్ట్ లో పెట్టుకున్న పిటీషన్ కూడా అంతే ఆశ్చర్యంగా వుంది.
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు క్రిష్. ఇందులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఒక్కసారి డ్రగ్స్ లాంటి కేసుల్లో పేరు వచ్చాక పోలీసులు కోర్టులు పిటీషన్లు కామన్,. అయితే క్రిష్ మాత్రం తనని ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొనడం మళ్ళీ సందేహాలు తావిస్తుంది. క్రిష్ మృదు స్వభావి. ఎవరితో వైరం పెట్టుకునే రకం కాదు. ఆయన పనేదో ఆయనది. అలాంటి క్రిష్ ని ఇరికించాల్సిన అవసరం ఎవరికి వుంటుందనే అందరి ప్రశ్న.