రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ నిండా మునిగిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలున్నాయి. డ్రగ్స్ కేసులో FIR లో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చిన పోలీసులు A10 గా డైరెక్టర్ క్రిష్ ను పేర్కొన్నారు. A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్ , డ్రగ్ సప్లయర్ A12 గా మీర్జా వహీద్ బేగ్ చేర్చారు. గత ఏడాది నుండి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి బానిస అయ్యారని.. రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన A10 డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సిందితో కలిసి డ్రగ్స్ తీసుకునేవారని చెబుతున్నారు.
ఈ నెల 24 జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ లో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారు. డ్రగ్ పార్టీ లో శ్వేత ,లిసి ,నీల్ ,డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారి కూడా రాడిసన్ హోటల్ లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ మీర్జా వహీద్ బేగ్ నుండి గ్రాము కొకైన్ ను 14 వేలకు కొనుగోలు చేశారని.. వివేకా సూచనలు మేరకు అతని వ్యక్తి గత డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కి డ్రగ్స్ సప్లై చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. వివేక్ ఆదేశాలు మేరకు 2 గ్రాముల కొకైన్ ను డ్రైవర్ ప్రవీణ్ కి పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ డెలివరీ చేశాడన్నారు.
రెండు గ్రాముల కొకైన్ ను సయ్యద్ అలీ కి డ్రైవర్ ప్రవీణ్ 32000 గూగుల్ పే ద్వారా చెల్లించాడు.. ఈ నెల 24 తేదీన మధ్యాహ్నం వివేక్ తన స్నేహితులు రఘుచరణ్, కేదార్నాథ్, సందీప్,శ్వేత ,లిసి ,నిల్ ,డైరెక్టర్ క్రిష్ తో డ్రగ్ పార్టీ చేసుకున్నారు. పేపర్ రోల్‌ని ఉపయోగించి తన స్నేహితులతో కలిసి వివేక్ 3 గ్రాముల కొకైన్ సేవించారు.. రాడిసన్ హోటల్లోని 1200 & 1204 నెంబర్ గల రెండు గదుల్లో డ్రగ్స్ సేవించినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సప్ ఛాటింగ్ కూడా సేకరించారు.
దర్శకుడు క్రిష్ పోలీసుల విచారణకు రాలేదు. తాను ముంబైలో ఉన్నానని.. రెండు రోజుల తర్వాత వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది.