ప్రముఖ దర్శకుడు క్రిష్ పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఆగస్టు 8వ తేదీ తెల్లవారుఝామున 2.30 నిమిషాల సమూర్తమున క్రిష్, రమ్యల పెళ్లి జరపాలని ఇరుకుటుంబ పెద్దలు నిర్ణయించుకొన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని మారియట్ హోటెల్లో క్రిష్ – రమ్యల నిశ్చితార్థం వైభవంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. నందమూరి బాలకృష్ణ, రానా, అల్లు అర్జున్, సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. రమ్య హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. వివాహ వేదికని ఖరారు చేయాల్సివుంది.