అప్పుడెప్పుడో మొదలెట్టిన హరి హర వీరమల్లుని పక్కన పెట్టేసి, మిగిలిన సినిమాలపై, రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు పవన్ కల్యాణ్. బ్రో అయిపోయింది. ఇప్పుడు ఓజీపై దృష్టి నిలిపాడు. ఓజీతో పాటుగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సమాంతరంగా పూర్తి చేయాలని పవన్ ప్లాన్. 2024 ఎన్నికల తరవాతే.. హరి హర వీరమల్లు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకూ క్రిష్ ఖాళీగా ఉండాల్సిందే.
అందుకే మధ్యే మార్గంగా మరో సినిమాని పట్టాలెక్కించాలని క్రిష్ ఫిక్సయ్యాడు. కథ కూడా రెడీ అయ్యింది. హీరో దొరకడమే బాకీ. ప్రస్తుతం యంగ్ హీరోలంతా బిజీగా ఉన్నారు. సీరియర్లు కూడా వారి వారి ప్రాజెక్టులతో తలమునకలైపోయారు. ఈ పరిస్థితుల్లో క్రిష్‌కి హీరో దొరకడం కష్టంగా మారింది. కొత్తవాళ్లతో తీద్దామా అంటే.. ఆ దిశగా ఆలోచించి రిస్క్ చేయడం క్రిష్‌కి ఇష్టం లేదు. దొరికిన హీరోలతోనే సర్దుబాటు అవ్వాల్సిన పరిస్థితి. తనకున్న పరిచయాల దృష్టా.. కాస్తో కూస్తో రేంజ్ ఉన్న హీరోతో ఈ ప్రాజెక్ట్‌ని సెట్ చేయాలన్నది క్రిష్ ఉద్దేశం. ఈసారి కూడా క్రిష్ దృష్టి మెగా హీరోపైనే ఉందన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. ఆ హీరో సాయిధరమ్ తేజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బ్రో తరవాత తేజ్ కాస్త విరామం తీసుకోవాలనుకొంటున్నాడు. ఆ ఆలోచన పక్కన పెట్టి, క్రిష్‌తో ఓ సినిమా పూర్తి చేస్తాడేమో చూడాలి.