ఈ హెడ్డింగ్ చూసి, ఎన్టీఆర్ సినిమా డైరక్టర్ గా క్రిష్ బాధితుడేమో అని అనుకోవాల్సిన పని ఎంత మాత్రం లేదు. ఎందుకంటే డైరక్టర్ గా ఆ సినిమా ఏ మేరకు తీసుకెళ్లగలడో అంతా చేసాడు క్రిష్. రివ్యూల రూపంలో ఆ మేరకు అభినందనలు కూడా వచ్చేసాయి. అందువల్ల పాయింట్ అది కాదు.
ఎన్టీఆర్ బయోపిక్ ను కొని బాధితులైన వారి జాబితాలో క్రిష్ కూడా వున్నాడట. అదీ పాయింట్. క్రిష్ కేవలం క్రియేటర్ మాత్రమే కాధు. బిజినెస్ మన్ కూడా. ఆయన తండ్రి కి వ్యాపారాలు వున్నాయి. క్రిష్ స్నేహితులతో కలిసి సినిమాలు, టీవీ షో లు నిర్మిస్తారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బయోపిక్ గుంటూరు ఏరియా హక్కులను క్రిష్ కొన్నట్లు తెలుస్తోంది.
ఆరు కోట్లకు గుంటూరు హక్కులు తీసుకుని, అందులో సగం అంటే మూడు కోట్ల వాటా వేరేవాళ్లకు విక్రయించారు. ఇప్పుడు ఆ ఏరియా వసూళ్లు గట్టిగా మూడు కోట్లు దాటలేదు. అంటే సగానికి సగం పోయింది. అంటే క్రిష్ కు కోటిన్నర లాస్. రెండో పార్ట్ మీద అందరూ ఆధారపడినట్లే క్రిష్ కూడా ఆధారపడ్డారు. బాలయ్య తీసుకునే నిర్ణయం మీదే ఇది ఫైనల్ కావాలి. లేదంటే, రెమ్యూనిరేషన్ లో వచ్చిన ఆదాయంలోంచి కొటిన్నర మైనస్.