కొబ్బరిమట్ట తో రూపాయికి రెండు రూపాయలు సంపాదించారు నిర్మాతలు. ఆ సినిమాని ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు. కామెడీగానే చూశారు. అయినా సరే – లాభాలొచ్చాయి. ఆ సినిమాతో పాటు విడుదలైన మన్మథుడు 2 డిజాస్టర్ అయితే – కొబ్బరి మట్ట లాభాల్ని సంపాదించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో సంపూతో సినిమా చేస్తే బాగానే వర్కవుట్ అవుతుందన్న నిజం జనాలకు తెలిసింది. అందుకే కొంతమంది పెద్ద నిర్మాతలు కూడా సంపూతో ఓ కామెడీ సినిమా చేద్దామని ఫిక్సయినట్టు సమాచారం. అందులో భాగంగా క్రిష్ సంపూతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నార్ట. ఈ సినిమాకి క్రిష్ నిర్మాతగా మాత్రమే వ్యవహరించబోతున్నారు. మరోవైపు సి.కల్యాణ్ కూడా సంపూతో ఓసినిమా చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. చూస్తుంటే – సంపూ ఫీవర్ బాగానే పాకేసినట్టుంది.