గౌతమి పుత్ర శాతకర్ణితో అటు బిజినెస్ వర్గాల్నీ, ఇటు కథానాయకుల్నీ ఆకర్షిస్తున్నాడు క్రిష్. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే బిజినెస్ క్లోజ్ చేసుకోవడంతో క్రిష్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికి దాదాపు రూ.15 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కించుకొంది గౌతమిపుత్ర. ఇదంతా క్రిష్ ప్రతిభ, బాలయ్యపై ఉన్న నమ్మకం అనుకోవొచ్చు. దాంతో.. క్రిష్‌పై కొంతమంది కథానాయకులు గురి పెట్టారు. గౌతమి పుత్ర రిజల్ట్‌తో సంబంధం లేకుండా క్రిష్‌తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. అయితే క్రిష్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ఆయన మళ్లీ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇది వరకు అక్షయ్ కుమార్‌తో గబ్బర్ సినిమాని తెరకెక్కించాడు క్రిష్. తెలుగులో ఠాగూర్ (తమిళంలో రమణ) చిత్రానికి ఇది రీమేక్. మళ్లీ ఇప్పుడు బాలీవుడ్లోనే సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారు క్రిష్. ఈసారి కూడా అక్షయ్ కుమార్‌తోనే క్రిష్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 2017 వేసవిలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. బాలీవుడ్ సినిమా అంటే ఎంత కాదన్నా యేడాది సమయం పడుతుంది. అంటే… 2018 వరకూ క్రిష్ తెలుగు హీరోలకు దొరకడన్నమాట.