వెబ్ సిరీస్‌లకు ఇప్పుడు డిమాండ్ బాగుంది. సినిమాలకంటే యూత్ వెస్ సిరీస్ వైపే ఆసక్తి చూపిస్తున్నారు. బడా సంస్థలు, పెద్ద దర్శకులు సైతం వెబ్ సిరీస్ లవైపు దృష్టి సారిస్తున్నారు. తాజాగా క్రిష్ కూడా వెబ్ సిరీస్ పై ఫోకస్ చేశాడు. క్రిష్ తన నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్స్ లో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. కథ, స్క్రీన్ ప్లే క్రిష్ సమకూర్చాడు. ఈ వెబ్ సిరీస్‌కి క్రిష్ దర్శకత్వం వహిస్తారా? లేదంటే.. రచయితగానే ఉండిపోతాడా? అనేది ఇంకా తేలలేదు. ఎన్టీఆర్ బయోపిక్‌ల తరవాత క్రిష్ నుంచి కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన ఏదీ రాలేదు. తన తదుపరి సినిమాకి ఇంకాస్త సమయం ఉన్నందున – ఈలోగా వెబ్ సిరీస్‌పై దృష్టి పెట్టాడు క్రిష్. సినిమా మొదలయ్యేలోపు వెబ్ సిరీస్ పని పూర్తవుతుందనుకుంటే – దర్శకత్వ బాధ్యత కూడా క్రిష్ తన మీద వేసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలైంది.