వకీల్ సాబ్ తరవాత పవన్ కల్యాణ్ పట్టాలెక్కించాల్సిన సినిమా క్రిష్ దే. కానీ పవన్ ఆలోచన మారింది. క్రిష్ సినిమా కాస్త వెనక్కి జరిపి, ఆ స్థానంలో హరీష్ శంకర్ సినిమా ఓకే చేయాలని చూస్తున్నాడు. ఈ విషయమై.. పవన్ – హరీష్ ల మధ్య భేటీ జరిగిందని, `స్క్రిప్టు రెడీ చేసుకో.. ఎప్పుడైనా సరే, పట్టాలెక్కించడానికి సిద్ధంగా ఉండు` అంటూ పవన్ హింట్ ఇచ్చాడని గుసగుసలు వినిపించాయి.
క్రిష్ సినిమా వెనక్కి నెట్టడానికి చాలా కారణాలున్నాయి. క్రిష్‌ది పాన్ ఇండియా సినిమా. కాస్త లేట్ అవుతుంది. భారీ సెట్లు, క్రౌడ్, హంగామా ఉంటుంది. కరోనా భయాల మధ్య… ఇంత భారీ తారాగణం మధ్య షూటింగ్ చేయడం కష్టమే. అందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. అందుకే క్రిష్ ఇప్పుడు మరో ప్లాన్ వేశాడు. తక్కువ టీమ్‌తో షూటింగ్ చేయగల సన్నివేశాలన్ని ఓ షెడ్యూల్లో చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు. పవన్‌తో పాటు ఒకరిద్దరు ఉండే సీన్లు ముందుగా తీస్తానని, భారీ తారాగణం అవసరమైన సన్నివేశాలన్నీ చివర్లో తీసుకుందామని పవన్‌కి సర్ది చెబుతున్నాడట. ఇలాగైతే.. వకీల్ సాబ్ తరవాత క్రిష్ సినిమా మొదలవుతుంది. అయితే దానికి పవన్ అంగీకారం తెలపాల్సివుంటుంది. క్రిష్ సినిమా కొంత మేర షూటింగ్ జరిగింది. సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయడంలో క్రిష్ నేర్పది. ఇవన్నీ క్రిష్ సినిమాకి ప్లస్ పాయింట్లు. కానీ.. ఏ సినిమా ముందుగా మొదలవ్వాలన్నది పవన్ చేతుల్లో ఉందిప్పుడు.