చిరుతో సినిమా చేయాలని కృష్ణవంశీ ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. కృష్ణవంశీతో సినిమా చేయలేదు కానీ.. చిరంజీవికి వంశీ అంటే ప్రత్యేకమైన అభిమానం. కృష్ణవంశీ కెరీర్ డల్ గా ఉన్నప్పుడు రామ్ చరణ్ కి ఇచ్చాడు. ఇద్దరి కాంబోలో ‘గోవిందుడు అందరి వాడేలే’ రూపుదిద్దుకొంది. కృష్ణవంశీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. చేయి అందించడానికి చిరు ముందే ఉంటాడు. `రంగమార్తండ`లో ఓ షాయరీ చదివి… ఆ సినిమా ప్రమోషన్లకు శుభారంభం అందించాడు చిరు. ఇప్పుడు `రంగమార్తాండ` కు మరింత బూస్టప్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగమార్తండ’. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాని చిరంజీవి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమా చూసి..చిరు కదిలిపోయాడట. ”ఈ సినిమా జనంలోకి వెళ్లాలి. అందుకోసం ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా నేను సిద్ధమే. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నేను, చరణ్ వస్తాం..” అని హామీ ఇచ్చాడట చిరు. మెగా హీరోలు వస్తే.. `రంగమార్తాండ` సినిమాకి కావల్సినంత ప్రమోషన్లు లభించినట్టే. ఇలా చిన్న సినిమాలకు చిరు అండగా ఉండడం కంటే కావల్సిందేముంది? మొత్తానికి కృష్ణవంశీపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకొన్నాడు చిరు.