సృజనాత్మక సినిమాలు తీయడంలో ఆయనకు సాటిలేరని అనిపించుకున్న దర్శకుడు కృష్ణవంశీ. గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ దర్శకుడు ప్రస్తుతం రెండు సినిమా కథలను సిద్ధం చేసుకుని పెట్టుకున్నాడట. అందులో ఒకటి అనుష్క ప్రధాన పాత్రలో వచ్చే ‘రుద్రాక్ష’ కాగా.. మరోటి ఓ థ్రిల్లింగ్ కథ అట అయితే ఇది అంతా కొత్త వారితో తీసే ఆలోచనలో ఉన్నాడు కృష్ణవంశీ. అదేంటి మొన్నటిదాకా అనుష్క సినిమానే తీస్తానన్న కృష్ణ వంశీ అకస్మాత్తుగా కొత్తవారితో తీసే సినిమా ఏంటని ఆశ్చర్య పోవచ్చు.
రుద్రాక్ష సినిమాకు అనుష్క ఇప్పుడప్పుడే దొరకడం కష్టం అని అనుకున్నాడో ఏమో గాని కృష్ణవంశీ కొత్త వారితో మరో సంచలనాత్మక కథని సిద్ధం చేసుకున్నాడట. రుద్రాక్షకు ముందే ఈ సినిమాను తీసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు ఈ దర్శకుడు. ఒకప్పుడు ఫుల్ ఫాం లో ఉన్నప్పుడే డేంజర్ అంటూ ఒక ప్రయోగం చేసిన కృష్ణంవంశీ ఇప్పుడు కూడా అలానే ఓ కొత్త కథతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. డేంజర్ సినిమాలానే కుర్ర హీరోలతో చేస్తాడా లేక అంతా కొత్త వారినే తీసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.
కొత్త వారితో ప్రయోగాలు చేయడం కృష్ణవంశీకి కొత్తేమీ కాదు. మరి తనలో ఉన్న సృజనను సరిగా బయటపెట్టి పోగొట్టుకున్న క్రేజ్ సంపాధించుకుంటాడనే ఆశిస్తున్నారు ఆయన అభిమానులు.