పాతాళ భైరవి…. తెలుగు చిత్రసీమలో ఓ ఆణిముత్యం. ఆ సినిమాలోని పాటలు, మాటలు.. అన్నీ అజరామరాలు. ఈ సినిమాని హిందీలో తీసుకెళ్లాలన్నది కృష్ణ ఆలోచన. అది ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ సినిమాని హిందీలో కృష్నతో రీమేక్ చేయాలని కృష్ణ భావించార్ట. కానీ.. మహేష్ ఇందుకు ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చారు.
”పాతాళ భైరవిని మహేష్ తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నాం.కానీ మహేష్ ఒప్పుకోలేదు. మహేష్‌కు బాలీవుడ్ వెళ్లాలన్న ఆలోచన లేదు. ఇక్కడ తాను నెంబర్ వన్ గా ఉన్నాడు. అక్కడకు వెళ్లి నలుగురిలో ఒకడిగా ఉండడం ఎందుకన్నది తన ఆలోచన. అయితే ఈ సినిమాని హిందీలో రీమేక్ తప్పకుండా చేస్తాం. సుధీర్ బాబు నటించిన `ప్రేమకథా చిత్రమ్`ని హిందీ హృతిక్ రోషన్ తో తెరకెక్కించాలి. పద్మాలయా స్టూడియోస్ పై ఈసినిమా తీస్తాం. నిజానికి లాక్ డౌన్ లేకపోతే ఎప్పుడో ఈ సినిమా పట్టాలెక్కేది” అన్నారు కృష్ణ.
మహేష్ ని బాలీవుడ్ సినిమాలో చూడాలన్నది ఆయన అభిమానుల ఆశ. కృష్ణ మాటలు చూస్తుంటే… ఆ ఆశలు ఆడియాశలు గానే ఉండిపోతాయేమో అనిపిస్తోంది. చూద్దాం.. మహేష్ మనసు ఎప్పటికైనా మారుతుందేమో..?