నాచురల్ స్టార్ నాని నటించిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఈరోజు రిలీజ్ అయ్యింది. అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. లాస్ట్ ఇయర్ భలే భలే మగాడివోయ్ హిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని మరోసారి అలాంటి విజయం అందుకునే దిశగా పరుగులు తీస్తున్నాడు.
రిలీజ్ అయిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నాని మరోసారి తన మ్యాజిక్ పర్ఫార్మెన్స్ చూపించాడు. మెహెరిన్ అందాలు కూడా సినిమాకు హైలెట్ అయ్యాయి. ఇక దర్శకుడు సినిమా కథ కథనాల్లో చాలా ప్రత్యేకతను చూపించాడని చెబుతున్నారు. 14 రీల్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాను రాం ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర్ లు నిర్మించారు.
విశాల్ చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమా పాటలు వాటి పిక్చరైజేషన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సో నాని తన సూపర్ హిట్ మేనియాను ఈ సినిమా కూడా కంటిన్యూ చేస్తున్నాడు. సినిమా ఓపెనింగ్ కలక్షన్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండొచ్చని అంచనా. సో కృష్ణగాడి వీర ప్రేమ గాథ నానికి మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో పడేలా చేసింది.