యంగ్ రెబల్ స్టార్ పెళ్లెప్పుడు ఇప్పుడు నెటిజెన్ల హాట్ టాపిక్ ఇదే.. ఇనాళ్లు కేవలం టాలీవుడ్ హాట్ ఫేవరేట్ అయిన ప్రభాస్ బాహుబలితో ఇండియా వైజ్ భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు. ఇక వారిలో అమ్మాయిలైతే లెక్కలేనంత మంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లెప్పుడు చేసుకుంటాడని తెగ ఉత్సాహంగా ఉన్నారు అందరు. అయితే ఈ కోవలోనే గుంటూరు బి.టెక్ అమ్మాయిని ప్రభాస్ సెలెక్ట్ చేసుకున్నాడని ఆమెతోనే పెళ్లికి సిద్ధమవుతున్నాడని మీడియా రచ్చ రచ్చ చేస్తుంది. ఇంకొందరైతే ప్రభాస్ పెళ్ళిచేసుకోబోయే అమ్మాయి ఈమె అంటూ ఎవరో ఒక అమ్మాయి ఫోటోని కూడా మీడియాలో చూపిస్తున్నారు.
అయితే ఈ విషయం ఆ నోట ఈ నోటా పడిచివరకు రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు దగ్గరకు వెళ్లింది. ఇక దాని గురించి స్పంధించిన కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లిపై వస్తున్న రూమర్లన్ని పుకార్లే అని కొట్టిపడేశారు. బేస్ లెస్ రూమర్లు ఇలాంటివన్ని ఎలా పుట్టిస్తారని మీడియాపై ఫైర్ అయ్యాడు రెబల్ స్టార్. ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ కోసమే ప్రభాస్ రెడీ అవుతున్నాడు అంతే.. ఒకవేళ ప్రభాస్ పెళ్లి గురించి ఏదన్నా విషయం ఆలోచిస్తే దాన్ని ముందుగా మీడియాకే తెలియచేస్తామని చెప్పారు కృష్ణంరాజు.
రాజు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఫియాన్సీ అని మీడియాలో చెక్కర్లు కొడుతున్న అమ్మాయి నిజం కాదని తెలుస్తుంది. మొత్తానికి ప్రభాస్ పెళ్లి గురించి మీడియా చూపిస్తున్న చొరవకు కృష్ణం రాజు చురకలంటించడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరి అసలు విషయం పెదనాన్న గారే చెబుతా అంటున్నారు కదా ఆయన నోటి నుండి వచ్చేదాకే వెయిట్ చేద్దాం అని అంటా సైలెంట్ అయిపోయారు.