రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసత్వాన్ని అందుకుని యంగ్ రెబల్ స్టార్ గా అభిమాన నీరాజనాలు అందుకుంటున్న ప్రభాస్ సినిమా చరిత్రలోనే ఎవరికి సాధ్యం కాని బాహుబలి లాంటి గొప్ప సినిమా తీసి అభిమానులకు కానుకగా ఇచ్చాడు. తన ప్రతి ఒక్క అభిమాని గర్వంగా చెప్పుకునే విధంగా సినిమా అందించిన ప్రభాస్ ఆ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయాడు. అయితే రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ప్రభాస్ చేత ఓ సినిమా తీద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పట్లో భక్త కన్నప్ప తీద్దామనుకుంటే దానికి మంచు విష్ణు అడ్డుపడ్డాడు.
అయితే ఇప్పుడు కృష్ణంరాజు తన గోపి కృష్ణ పతాకంలో ‘దందా’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించడం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. మాస్ మూవీగా అనిపిస్తున్న ఆ టైటిల్ కృష్ణం రాజు కచ్చితంగా ప్రభాస్ కోసమే రిజిస్టర్ చేయించి ఉంటాడని అంటున్నారు. సినిమాకు సంబంధించిన ఎటువంటి వార్త బయటకు రాలేదు కాని గోపికృష్ణ పతాకంలో ‘దందా’ టైటిల్ రిజిస్టర్ కావడంతో హడావిడి చేయడం మొదలెట్టారు పాత్రికేయులు.
ప్రస్తుతం బాహుబలి రెండవ భాగం కోసం సన్నద్ధమవుతున్న ప్రభాస్ అది పూర్తి చేసి కాని వేరే సినిమా చేసే అవకాశం లేదు. ఇక బాహుబలి తర్వాత రన్ రాజా రన్ సినిమా దర్శకుడుతో ఓ సినిమా ఇంతకుముందే ఖాయమవ్వడం జరిగింది. మరి కృష్ణంరాజు రిజిస్టార్ చేసిన టైటిల్ రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ తీసే సినిమానా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది.