అవిశ్వాస తీర్మానం వల్ల దేశంలో మోడీ పట్ల ఎంత విశ్వాసం ప్రజలు చూపుతున్నారో అర్ధమయ్యింది అన్నారు కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు. అవిశ్వాసం కోసం 18 పార్టీల మద్దతు కూడగట్టాం అన్నారు కానీ ఒక్క పార్టీ తో కూడా సభలో ఏపీ కి అన్యాయం జరిగిందని మాట్లాడించలేకపోయారేంటని ఆయన ప్రశ్నించారు.. ప్రజల బాగుకోరుకునే నాయకులు వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు..
పోలవరం, దుగ్గిరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం, విశాఖపట్నం రైల్వే జోన్, ట్రైబల్ యూనివర్సిటీ పై త్వరలోనే కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించబోతుంది అన్నారు..
కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు వాస్తవాలు చెప్తారన్నారు.. జాతీయ విద్యా సంస్థలు అన్ని తాత్కాలిక భవనాలలో నిర్వహిస్తున్నారని.. త్వరితగతిన శాశ్విత భవనాలు నిర్మించి వీటిని అందులోకి మార్చేందుకు కేంద్రం అన్ని విధాలా కృషిచేస్తుంది అన్నారు.. అమరావతి నిర్మాణం కోసం నిధుల కేటాయించామని మరిన్ని నిధులు కావాల్సివస్తే వాటికి వనరులని కేంద్రం చూపిస్తుంది అని ఆయన అన్నారు..అతి త్వరలోనే టీడీపీ అన్యాయం జరిగింది అని చెప్పుకోటానికి ఏ అంశము మిగలదని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
మోడీ పై వ్యక్తిగత విమర్శలు చేయడం భావ్యం కాదని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఢిల్లీ లోని పార్టీ పెద్దలకు నివేదికలు సిద్ధం చేసి పంపుతున్న కృష్ణంరాజు త్వరలోనే ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను, పలువురు కేంద్రమంత్రులను ఢిల్లీ లో కలవనున్నట్లు తెలిపారు.