నాని భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. అతని జోరు.. సినిమా సినిమాకీ అలా.. పెరుగుతూనే ఉంది. ఏంసీఏ తరవాత నాని నుంచి వస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్దం’ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో నాని ‘డబుల్ యాక్షన్’. కృష్ణ, అర్జున్‌ల కథ ఇది. కృష్ణ పల్లెటూరి కుర్రాడు, అర్జున్ ఓ రాక్ స్టార్. ఇద్దరికీ ఉన్న లింకేంటి? ఇద్దరూ కలిసి యుద్ధం చేశారా, ఒకరిపై మరొకరు యుద్ధం ప్రకటించారా? అనేదే కథ. కథకి సంబంధించిన ఎలాంటి క్లూ ట్రైలర్లో దొరకలేదు. నాని స్టైల్ ఆఫ్ హ్యూమర్, సరదా డైలాగులు, రొమాంటిక్ సీన్ల కంటే… యాక్షన్నే కాస్త ఎక్కువగా దట్టించినట్టు అనిపిస్తోంది. ప్రేక్షకులకు ఇలాంటి అనుమానం వస్తుందని దర్శకుడు ముందే ఊహించాడేమో.. ‘సడన్ గా ఈ యాక్షనేంటి?’ అంటూ ఓ పాత్రతో పలికించి.. ‘యాక్షన్ కాదు.. డబుల్ యాక్షన్’ అంటూ.. ఇద్దరు నానిలూ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. ఏప్రిల్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.