కృతిక జయకుమార్.. దృశ్యంలో వెంకటేష్ కి కూతురుగా నటించింది. ఆ తరవాత ఈ అమ్మాయికి కథానాయికగా ప్రమోషన్ ఇచ్చేశారు. వినవయ్యా రామయ్యలో కథానాయిక తనే. ఇప్పుడు అల్లరి నరేష్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. నరేష్ కథానాయకుడిగా జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇదో హారర్ కామెడీ చిత్రం. ఈ సినిమా పేరు కూడా వెరైటీగానే ఉంది. మా ఇంట్లో దెయ్యం… నాకేం భయ్యం! కథ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇక సెట్‌కి వెళ్లడమే తరువాయి. సెల్పీ రాజా తరవాత నరేష్ చేయబోయే సినిమా ఇదే. కాస్త సంప్రదాయబద్దంగా ఉండే అమ్మాయిని హీరోయిన్ పాత్రకు తీసుకొందామనుకొన్నారు. ఆ ఛాన్స్ కృతికు దక్కింది.
అన్నట్టు రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేస్తున్నారు. మా అల్లుడు వెరీ గుడ్డు తరవాత… రాజేంద్రుడు, అల్లరోడు కలసి నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో సీజీ వర్క్‌కి ప్రాధాన్యం చాలా ఉందట. హారర్ కామెడీ సినిమాల్లోనే ఇది సరికొత్తగా తీర్చిదిద్దబోతున్నట్టు టాక్. ఇప్పటి వరకూ చిన్నా చితకా హీరోలే భయపెట్టారు. ఇప్పుడు నరేష్ లాంటి మినిమం రేంజ్ హీరోలు సైతం.. హారర్ కామెడీలు చేసేస్తున్నారు. మున్ముందు స్టార్ హీరోలూ.. భయపెట్టేస్తారేమో?