ఉప్పెనతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది కృతి శెట్టి. ఈ సినిమా విడుదల కాకముందే.. కృతికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే మైత్రీ మూవీస్ కృతితో మరో రెండు సినిమాలకు ఎగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈలోగా.. సుకుమార్ కూడా ఇంకో ఛాన్సిచ్చేసినట్టు సమాచారం. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `18 పేజీలు`. నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఆ ఛాన్స్ కృతికి దక్కినట్టు తెలుస్తోంది. ఇందులో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. సినిమా అంతా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగుతుందని సమాచారం. ఆ పాత్రకు కృతి అయితే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నాడు. ఉప్పెన లోంచి ఇప్పటి వరకూ రెండు పాటలు బయటకు వచ్చాయి. ఆ రెండు పాటల్లోనూ కృతి లుక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా విడుదల అయ్యాక.. రిజల్ట్ ఎలా ఉన్నా సరే.. కృతికి మంచి ఆఫర్లు దక్కుతాయని అంతా అంచనా వేస్తున్నారు. అయితే రషెష్ ముందే చూసేసిన సుకుమార్… అందరికంటే ముందే కర్చీఫ్ వేశాడిలా.