పివిపి బ్యానర్ లో రవికాంత్ పారెపు దర్శకత్వంలో వచ్చిన సినిమా క్షణం. ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అంటే మొదట అదే అని చెప్పాలి. కోటి బడ్జెట్ తో తెరకెక్కించిన క్షణం సినిమా పబ్లిసిటీతో కలుపుకుని రెండు కోట్లయింది. కాని సినిమా రిలీజ్ అయ్యి 8 కోట్ల దాకా వసూళు చేయడం విశేషం. అంతేకాదు శాటిలైట్ రైట్స్ రూపంలో, ఇంకా సినిమా వేరే భాషల్లో రీమేక్ హక్కులంటూ సినిమా మీద చాలా ఎక్కువ మొత్తాన్నే లాభంగా పొందారు దర్శక నిర్మాతలు.
మొదటి సినిమా అయినా దర్శకుడు కమిట్ మెంట్ బాగా నచ్చేసింది. చెప్పాలనుకున్న విషయాన్ని ఎటువంటి కన్ ఫ్యూజన్స్ లేకుండా చెప్పి వారెవా అనిపించాడు. ప్రస్తుతం తన రెండో సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు రవికాంత్. ఈ మధ్యనే రానాకు ఓ కథ వినిపించడంతో ఓకే చెప్పాడట. డీఫరెంట్ లవ్ స్టోరీతో వచ్చే ఈ సబ్జెక్ట్ రానాకు బాగా నచ్చిందట. అయితే బాహుబలి-2 పూర్తి చేశాక రానా తీసే సినిమా ఇదే అవుతుంది అని ఫిల్మ్ నగర్ టాక్. ఫస్ట్ మూవీ చిన్న సినిమా తీసి దాని హిట్ తో రానా వంటి స్టార్ హీరోతో సినిమా తీసే ఛాన్స్ కొట్టేయడం రవికాంత్ నిజంగా లక్కీ అని చెప్పాలి. మరి వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.