అడివి శేష్ ‘క్షణం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రవికాంత్ పేరేపు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. కష్టాల్లో వున్న శేష్ కెరీర్ కి ఓ దారి చూపింది. అయితే దర్శకుడిగా రవికాంత్ కు మాత్రం రావాల్సిన పేరు రాలేదు. ఈ సినిమా మొత్తం క్రెడిట్ శేష్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అందరూ శేష్ గురించే మాట్లాడారు. ఆయనకి రైటింగ్, డైరెక్షన్ లో ప్రవేశం వుండటంతో అంతా ఆయన చూసుకున్నాడనే ప్రచారం జరిగింది. ఈ విషయానికి స్వయంగా రవికాంత్ నే చెప్పాడు.
‘
‘క్షణం నా మొదటి సినిమా. హిట్ అయ్యింది. కానీ క్రెడిట్ మొత్తం శేష్ కి వెళ్ళింది. ఈ విషయంలో నాకు ఎలాంటి కంప్లయింట్ లేదు. శేష్ నా గురించి ఎక్కడైనా చాలా గొప్పగా చెప్పాడు. ఆయనే కాదు మా టీంలో అందరూ దర్శకుడిగా నా కష్టాన్ని మర్చిపోరు. కానీ విచిత్రంగా ఆ ప్రాజెక్ట్ మొత్తం శేష్ చేశారనే ప్రచారం మాత్రం బాగా వెళ్ళింది. దర్శకుడి నా గురించి నేను చెప్పుకోవానికి ప్రయత్నించాను. కానీ లాభం లేకుండాపోయింది. ఒక దశలో విసిగిపోయాను. ”ఆ సినియాకి నేనేం చేయలేదు. డబ్బులిచ్చి దర్శకుడిగా పేరు వేయించుకున్నా”అని చెప్పాలనే నిర్ణయానికి వచ్చేశాను” అని తన మనసులో మాట చెప్పారు రవికాంత్.
ప్రస్తుతం యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల ని హీరోగా పరిచయం చేస్తూ ‘బబుల్గమ్’ సినిమా తీశాడు రవికాంత్. డిసెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.