కేటీఆర్ అరెస్టు ఖాయమని బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది.అందుకే కేటీఆర్ తో ప్రిపరేషన్స్ ప్రారంభించారు. ఏదో పెద్ద అకేషన్ ఉన్నట్లుగా మీడియా సంస్థలన్నింటినీ పిలిచి ఇంటర్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్యూల్లో రైతుల కోసం వంద సార్లు అరెస్టవుతానని అంటున్నారు. అంటే తనను అరెస్టు చేస్తే అది ఫార్ములా వన్ ఈ రేసులో కాదని … రైతుల కోసం చేసిన ఉద్యమంలో భాగంగా అని కేటీఆర్ చెప్పదల్చుకున్నారు. అందుకే ఈ ఇంటర్యూలు.
అరెస్టు చేస్తే ఎన్నో రోజులు జైల్లో పెట్టలేని మహా అయితే రెండు, మూడు నెలలు పెట్టగలరని తర్వాత బయటకు వస్తే ఇక పాదయాత్ర చేసుకోవచ్చని కేటీఆర్ అనుకుంటున్నారు. ఆయన మానసికంగా అరెస్టుకు సిద్ధమయ్యారు. తాను అరెస్టు అయితే ప్రజల్లోకి ఎలా ఆ పరిణామాల్ని పంపాలో కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో సోషల్ మీడియా ద్వారా రాజకీయాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీనే. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వెనుకబడి పోయి ఉంది.
కేటీఆర్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ తొందరపడుతుందా.. వేచి చూస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. కలెక్టర్ పై దాడి ఘటనలో ఆయన పేరు రిమాండ్ రిపోర్టులో ఉంది. ఇంకా ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఇలాంటి కేసులో అరెస్టు చేయకపోవచ్చని పక్కా సాక్ష్యాలతో ఉన్న ఫార్ములా ఈ రేసు కేసులో గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాతనే అరెస్టు చేస్తారని అంటున్నారు. కానీ గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రాలేదు.