”చాలా మంది హీరోలకి ఫ్యాన్స్ వుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంత కల్ట్ ఫాలోయింగ్ మరో హీరోకి లేదు” అని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. పవన్ కళ్యాణ్ ”భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లుడుతూ.. పవన్ కళ్యాణ్ మంచి మనసున్న మనిషి. ఆయన్ని కేవలం సినిమా హీరోగానే కాదు అంతకంటే ఎక్కివ ప్రేమిస్తారు, నేను మంత్రిగా కాదు పవన్ కళ్యాణ్ కి సోదరుడిగా ఈ వేడుకకి వచ్చాను. మనం అంతా పవన్ కళ్యాణ్ సినిమాలు చూసిన వాళ్ళమే. కాలేజీ రోజుల్లో తొలిప్రేమ నేనూ చూశాను. ఆయన అంటే అందరికీ అభిమానం. మొగులయ్యా లాంటి కళాకారులని గుర్తించిన పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. భీమ్లా నాయక్ కూడా మంచి విజయం సాధించాలి. తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకి ఎప్పుడూ ప్రోత్సాహం వుంటుంది. మీ అందరి సహకారంతో ప్రపంచంలోనే హైదరాబద్ ని సినిమా హబ్ గా మార్చాలనే ప్రణాళికతో ముందుకు పోతున్నాం.” అని చెప్పుకొచ్చారు కేటీఆర్.