పొలిటికల్ అటెన్షన్ ను బిల్డ్ చేసుకునేందుకు అప్పుడప్పుడు లీడర్లు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంటారు. ఆధారాలు లేకుండా ప్రత్యర్థి పార్టీల నేతలపై రెచ్చిపోతుంటారు. చేసిన ఆరోపణలపై ఆధారాలను అడిగితే త్వరలోనే వాటిని బయటపెడుతామని అనడం నేటి రాజకీయాల్లో సాధారణం అయిపోయింది.
ఇప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్స్ కూడా ఆ కోవలోనే కనిపిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా కంచ గచ్చిబౌలిలోని భూములపై సంచలన ఆరోపణలు చేశారు. 400 ఎకరాల భూముల వేలం వెనక భారీ కుంభకోణం దాగి ఉందన్నారు. ఆ స్కామ్ వివరాలను త్వరలోనే బయటపెడుతానన్నారు కానీ, ఎప్పుడు అనేది చెప్పలేదు.
HCU ల్యాండ్ ఇష్యూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఈ భూముల ఆక్షన్ వెనక స్కామ్ ఉన్నది నిజమైతే ఇప్పుడు ఆ వివరాలను బయటపెట్టడం పొలిటికల్ గా బీఆర్ఎస్ కు బూస్టింగ్ ఇచ్చేదే. స్టూడెంట్స్ కూడా బీఆర్ఎస్ కు అట్రాక్ట్ అవుతారు. ఇంతకుమించిన మంచి సమయం మళ్లీ రాదు..కానీ, కేటీఆర్ మాత్రం త్వరలోనే బయటపెడుతా అంటున్నారు.
ఆధారాలు సేకరించే పనిలో ఉండటంతోనే త్వరలోనే అంటున్నారా? లేక HCU వ్యవహారంలో బీఆర్ఎస్ లీడర్లపై కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా సర్కార్ పెద్దలను ట్రాప్ చేసేందుకు ఈ ఎత్తుగడ అనే వాదనలు వినిపిస్తున్నాయి.