చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రెండు రాజకీయ పార్టీల అంశంలా ఉందని .. అది రెండు పార్టీల సమస్య అని తెలంగాణకు సంబంధం లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో వైసీపీ, టీడీపీ లేవన్నారు. చంద్రబాబు బాబు అంశం కోర్టులో ఉంది దీని గురించి మాకు అనవసరం.. లోకేష్ నాకు కాల్ చేసి ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు.. ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దు.. ఎవరికి అనుమతి ఇవ్వం అని చెప్పానన్నారు. ఇది రెండు రాజకీయ పార్టీల ఘర్షణ.. ప్రశాతంగా ఉన్న ఐటీ డిస్టర్బ్ కావొద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో .. గవర్నర్ ఎమ్మెల్సీల్ని రిజెక్ట్ చేయడంపై పస్పందించేందుకు ప్రెస్ మట్ పెట్టారు.
ఈ అంశంపైనా మాట్లాడారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఆందోళనలు జరుగుతూంటే.. పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్లో ఆందోళనలు చేయడం ఏమిటని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ రెండు పార్టీలసమస్య అన్నారు. ధర్నాలు, ర్యాలీలు ఏపీలో చేసుకోవాలని.. తెలంగాణలో వద్దని స్పష్టం చేశారు. జగన్ , పవన్ , లోకేష్ అందరూ తనకు స్నేహితులేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాటల్ని బట్టి.. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల నిరసనల్ని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని భావిస్తున్నారు. అయితే తెలంగాణలోని పలు చోట్ల చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల.. నల్లగొండ జిల్లా కోదాడతో పాటు హైదరాబాద్ నిజామాబాద్ వంటి చోట్ల కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఎవరూ పెద్దగా అడ్డుకోవడం లేదు. ర్యాలీలు, నిరసనలు చేస్తే శాంతిభద్రతలు సమస్యలు వస్తాయని కేటీఆర్ ఎందుకు అనుకున్నారో కానీ.. బీఆర్ఎస్ లో ఉన్న నేతలు మాత్రం చంద్రబాబుకు మద్దతుగా ప్రకటనలు, ర్యాలీలు చేస్తున్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా అనేక మంది బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారు. రాజకీయ కక్ష సాధింపుల కోసమే అరెస్టు చేశారని ఇలాంటివి రాజకీయాల్లో తగవన్నారు. ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ కూడా నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి కూడా ఖండించారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబును తీవ్రంగా దూషించిన బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించి.. ఓ రోజు దీక్ష చేసి.. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. వీరెవర్ని కేటీఆర్ నియంత్రించలేదు.