కులగణన నివేదికపై ఉద్యమానికి కేటీఆర్ సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే బహిరంగసభ నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ వి,యాన్ని కేటీఆర్ ప్రాథమికంగా నిర్ధారించారు. బీసీ ల సంఖ్యను తక్కువ చేశారని ఐదు శాతం కన్నా తక్కువగా బీసీ ఓట్లను నమోదు చేయించాలని ఇందులో కుట్ర ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. ఈ అన్యాయాన్ని ఆపడానికి ఏం చేయాలో పార్టీ నేతలతో కలిసి మేథోమథనం నిర్వహిస్తున్నారు. గత వారం అందుబాటు లో బీసీ నేతలతో సమావేశం అయిన ఆయన.. తాజాగా ఈ ఆదివారం కీలక నేతలతో సమావేశమయ్యారు.
బీసీ భావజాల వ్యాప్తికి ఏం చేయాలో కార్యాచరణ ఖరారు చేసుకోవాలని నిర్ణయించారు. కులగణన పేపర్ చిత్తు పేపర్‌గా తేల్చారు. కాంగ్రెస్ దుర్మార్గ వైఖరికి బీసీ బిడ్డలు ఒప్పుకోవడం లేదని .. కులగణన సర్వే మళ్లీ శాస్త్రీయంగా నిర్వహించాలన్నారు. కులగణనలో తమ కుటుంబం పాల్గొనలేదని అంటున్నారని.., తాము ఎన్నికల సమయంలో సమర్పించిన నివేదికలుఉన్నాయని వాటి ఆధారంగా చూసుకోవచ్చన్నారు. తమ పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేయవద్దన్నారు. బీసీ డిక్లరేషన్ లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు సొల్లు మాటలు ఆపి.. రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి రెండుసీట్లు బీసీలకు ఇస్తామని చెప్పి మొత్తం మీద పందొమ్మిది మందికి బీసీలకు మాత్రమే చాన్స్ ఇచ్చిందని .. అందులోనూ పాతబస్తీలో ?ఐదు సీట్లు ఇచ్చారన్నారు. బీసీల భావజాల వ్యాప్తిలో భాగంగా జిల్లా , నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు పెట్టాలని నిర్ణయించారు.