HCU భూముల విషయంలో భారీ స్కామ్ జరుగుతోందని ఆరోపించిన కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి ఓ బీజేపీ ఎంపీతో కలిసి భూకుంభకోణాన్ని నడిపాడని ఆరోపించారు. అయితే, ఆ ఎంపీ పేరును మాత్రం ప్రకటించలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో బయటపెడుతానని చెప్పారు.
HCU ల్యాండ్ ఇష్యూలో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బీజేపీని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేశారు. అయితే, బీజేపీ ఎంపీతో కలిసి రేవంత్ భూకుంభకోణానికి పాల్పడ్డాడన్న కేటీఆర్.. ఆ ఎంపీ ఎవరనేది తర్వాత బయటపెడుతానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ దగ్గర స్పష్టమైన, నిర్దిష్టమైన సమాచారం లేక ఆ పేరును తర్వాత వెల్లడిస్తానన్నారా? లేక మరేదైనా రాజకీయ కారణం ఉందా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
స్పష్టమైన సమాచారం లేకపోతే బీజేపీ ఎంపీ ఉన్నాడని కేటీఆర్ ఆరోపణ చేసి ఉండకపోయేవారు అనేది కామన్ గా వినిపిస్తున్న మాట. మరోవైపు, కేటీఆర్ వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉంటే వెంటనే పేరు చెప్పకుండా ఎందుకు వాయిదా వేసి ఉంటారు అనే ప్రశ్న తెరమీదకు వస్తోంది. అయితే, రేవంత్ , బీజేపీ ఎంపీతో డీలింగ్ చేస్తున్నాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ బ్లాక్ మెయిల్ అని అంటున్నాయి కొట్టిపారేస్తున్నాయి కాంగ్రెస్ , బీజేపీ వర్గాలు.
నెక్స్ట్ ఎపిసోడ్ లో బీజేపీ ఎంపీ పేరును కేటీఆర్ బయటపెడితే.. ఈ విషయం మరింత హాట్ టాపిక్ అవుతోంది. లేదంటే , కేటీఆర్ బ్లాక్ మెయిలర్ అనే ట్యాగ్ ను మోయాల్సి ఉంటుంది. మరి , కేటీఆర్ ఏం చేస్తారో చూడాలి.