తనపై నమోదైన కేసు లొట్టపీసు కేసు అని నిలబడేది కాదని కేటీఆర్ పదే పదే రెండు రోజులకో సారి చిట్ చాట్లు ఏర్పాటు చేసి మీడియాకు చెబుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు అంత కంటే అద్భుతమైన వాక్యాలు ఊడిపడవన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా మీడియాప్రతినిధులతో మాట్లాడిన కేటీఆర్ పైసా అవినీతి జరగని చోట కేసును ఎలా పెట్టారని అంటున్నారు. ఏసీబీ పెట్టిన ఎఫ్ఐఆర్ తప్పు అని.. ఈ కేసు విషయంలో కోర్టులో జరుగుతన్న వాదన సందర్భంగా న్యాయమూర్తి అడిన ప్రశ్నలకు ఏజీ సమాధానం చెప్పలేకపోయారని అన్నారు.
ఈ కేసులో తనను అరెస్టు చేసినట్టైతే సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలన్నారు కేటీఆర్.ఎందుకంటే ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా నష్టం చేశారని అంటున్నారు. ఈడీ విచారణకు ఈ నెల 7న వెళ్లడంపై కేటీఆర్ నిర్ణయం తీసుకోలేదు. తన లాయర్లు చెప్పినట్లుగా చేస్తానని అంటున్నారు. న్యాయస్థానాలపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని కచ్చితంగా న్యాయం జరుగుతుందని అంటున్నారు.
రూ. 55 కోట్లు విదేశీ సంస్థకు లెక్కాపత్రం లేకుండా తరలిపోయిన కేసులో తానే ఆదేశించానని చెబుతున్న కేటీఆర్.. తాను అవినీతేం చేయలేదని అంటున్నారు. కానీ అసలు టెండర్లే పిలవని ప్రాజెక్టుల్లోవేల కోట్ల కుంభకోణం జరిగిపోతుదని ఇదే చిట్ చాట్లో ఆరోపించారు. టెండర్లు పిలవబోతున్న ట్రిపుల్ ఆర్ విషయంలో చాలా అవినీతి జరగబోతోందని ఆరోపించారు కేటీఆర్. దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరగబోతోందని అన్నారు. తెలంగాణలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారని అన్నారు. ఆ టెండర్లు పిలించి తెలంగాణ ప్రభుత్వం కాదు.. నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా.