అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలు కుట్రలు చేస్తాయని ఆందోళన వ్యక్తం చేయడం.. వచ్చే రెండు వారాలు బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు రాబోతున్నాయని ఊహించడం పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉందని చెప్పేదే. ప్రస్తుతం కేటీఆర్ అదే అంటున్నారు. వచ్చే రెండు వారాల్లో కొత్త కుట్రలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. కాళేశ్వరం కూలింది అని రెండు రోజుల్లో నివేదికలు రెడీ చేసి పంపిస్తారని .. సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీ, మోదీ కొత్త కొత్త రిపోర్టులు తయారు చేసి ఢిల్లీ నుంచి పంపిస్తారని జోస్యం చెప్పారు.
ఇదంతా ఎందుకంటే . దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా ఆ ఇద్దరు నేతలు కుట్రలు చేయబోతున్నారని కేటీఆర్ అంటున్నారు. ఈ పదిహేను రోజులు ఇవే కుట్రలు చేస్తూ మనల్ని మన ఆలోచన మార్చేలా చేస్తారని అంటున్నారు. కేటీఆర్ ఒక్క కాళేశ్వరం గురించేనా ఇంకా ఏమైనా కుట్రల గురించి సమాచారం ఉండి చెప్పారా అన్నదానిపై స్పష్టత లేదు. రాజకీయాల్లో తెర వెనుక ఏమి జరుగుతుందో అంచనా వేయగలుగుతారు. వారికి ఆ సోర్స్ ఉంటుంది.
తనను అరెస్టు చేయబోతున్నట్లుగా చంద్రబాబుకు ముందే తెలిసింది. రెండు రోజుల ముందుగానే ఆయన చెప్పారు. అన్నట్లుగానే అర్థరాత్రి అరెస్టు చేశారు. ఏ వ్యవస్థా కనీసం నోటీసులు ఇవ్వకుండా.. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం కరెక్ట్ కాదని చెప్పలేదు. ఇప్పుడు తమపై వచ్చే పదిహేను రోజుల్లో కొత్త కుట్రలు చేస్తారని కేటీఆర్ అంటున్నారంటే.. రాబోయే రోజుల్లో ఎవరూ ఊహించని కొత్త విశేషాలు బయట పడబోతున్నాయని అనుకోవచ్చేమో ?