తమ కారు షెడ్డుకెళ్లలేదని సర్వీసింగ్ కు మాత్రమే వెళ్లిందని కేటీఆర్ తమ పార్టీపై సెటైర్ వేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో రోజూ నియోజకవర్గాల సమీక్షలు చేస్తున్నారు. శుక్రవారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ప్రజల్ని పూర్తిగా తిరస్కరించలేదని భరోసా ఇచ్చారు. కారు షెడ్డుకెళ్లలేదని.. సర్వీసింగ్ కు మాత్రమే వెళ్లిందన్నారు. మళ్లీ ఫుల్ స్వింగ్‌తో తిరిగి వస్తామన్నారు. కేటీఆర్ కొద్ది రోజులుగా ప్రజలు తప్పు చేశామని బాధపడుతున్నారన్నట్లుగా మాట్లాడుతున్నారు.
దీనిపై విమర్శలు రావడంతో రివర్స్ లో పార్టీ నేతలకు హితవు పలికారు. బీఆర్ఎస్ను ఓడించి తెలంగాణ ప్రజలు తప్పుచేశారని కొంతమంది బిఆర్ ఎస్ నేతలు అక్కడక్కడా మాట్లాడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని అలా ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదని పార్టీ శ్రేణులకు కెటిఆర్ స్పష్టం చేశారు. తె పరిపాలన మీద ద్రుష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదని.. కార్యకర్తల ఆర్థిక స్థితినీ పట్టించుకోలేదని ఇదంతా తన బాధ్యతేనని చెప్పుకొచ్చారు. పథకాలు అందరికీ అందలేదని అందని వారువేరే వాళ్లకు కూడా వచ్చిందని కోపంతో వేయలేదని..రాని వాళ్లు అసలు వేయలేదన్నారు.
రైతుబందు తీసుకున్న సామాన్య రైతుకూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి వస్తే వొప్పుకోలేదన్నారు. పథకాల ద్వారా భవిష్యత్తులో తలెత్తబోయే ప్రజల్లో వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనావేయలేకపోవడం వల్ల ఇటువంటి ఫలితాలు వచ్చినట్టుగా తమ విశ్లేషణలలో తేలిందని కేటీఆర్ వివరించారు.