కేసీఆర్ ఇప్పటికి తన పాలనలో ట్రైలరే చూపించారని.. అసలు సినిమా ముందు ఉంటుందని కేటీఆర్ అంటున్నారు. హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన తండ్రి కేటీఆర్ ఆలోచనలు ఇంకా అమల్లోకి రాలేదని.. ట్రైలర్ మత్రమే అమలయిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు , వైఎస్లతో.. కేసీఆర్ ను పోల్చారు. వారిద్దరితో పోలిస్తే కేసీఆర్ చాలా బెటరన్నారు. ఎలాగో కూడా చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు, వైఎస్ఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఉన్న తేడా ఏంటో మున్సిపల్ మంత్రి కేటీఆర్ వివరించారు. చంద్రబాబు ఐటీ, బిజినెస్ రంగాలను ముందుకు నడిపించారు. తనను తాను ఒక సీఈవోగా అభివర్ణించుకునే వారన్నారు. వైఎస్ఆర్ రైతులు, సంక్షేమం, పేదలపై దృష్టి పెట్టారు. వారిద్దరూ కేవలం కొన్ని రంగాలనే ఎంచుకొని రాష్ట్రాన్ని పాలించారున్నారు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్దికి చర్యలు తీసుకుంటూనే.. మరో వైపు వ్యవసాయాన్ని అగ్రగామిగా నిలిపారని చెప్పుకొచ్చారు. 67 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలోనే సాధ్యపడిందంటే అందుకు సీఎం కేసీఆర్ దార్శనికతే కారణమని మంత్రి కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ ఇటీవల చెప్పే మాటలు మరీ అతిశయోక్తులుగా ఉన్నాయన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. గొప్పలు చెప్పుకోవచ్చు కానీ ఇతరుల్ని కించపరిచి.. వారితో పోల్సుకుని తాము గొప్పవారమని చెప్పుకోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. టీవీ9 ఇంటర్యూలో గాంధీ కుటుంబం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార గర్వానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.